సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ: న్యాయసమీక్షను కోర్టు ఆధిపత్యంగా చూడరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. న్యాయసమీక్షాధికారాన్ని న్యాయ వ్యవస్థ ఆధిపత్యం అంటే దృష్టితో చూడరాదని…రాజ్యాంగ సంస్థలు తమ విధి నిర్వహణలో విఫలమైన చట్టబద్ధమైన పాలనను సంరక్షించే రాజ్యాంగ బాధ్యతలో భాగంగానే న్యాయ సమీక్షను రూపొందించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారాన్ని వినియోగించడంలో చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత అనేవి ప్రాథమికమైన ముందస్తు షరతులన్నారు. విస్తృతమైన న్యాయసమీక్షాధికారం భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని చెప్పడం అతిశయోక్తి కాదని చెప్పారు. ‘చట్టబద్ధపాలన సంరక్షణ-భారత్, స్వీడన్ అనుభవాలు’ అనే అంశం స్టాక్హోమ్లో ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సదస్సులో న్యాయమూర్తి సూర్యకాంత్ ప్రసంగించారు. న్యాయసమీక్ష అధికారం మాత్రమే కాదని, అది న్యాయస్థానాలకు అప్పగించిన రాజ్యాంగ బాధ్యత అని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణలో న్యాయసమీక్ష, న్యాయస్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. చట్టబద్ధ పాలన అనేది ఒక సంక్షేమ పథకం కాదన్నారు. ఒక ఆర్థిక విధానం కూడా కాదని చెప్పారు. అది పేదరికాన్ని నిర్మూలించదని, ఉపాధిని కల్పించదని చెప్పారు. అధికార వినియోగాన్ని క్రమశిక్షణాయుతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. దీని పని చాలా ప్రాథమికమైనదని, తక్షణమే కనిపించదని న్యాయమూర్తి సూర్యకాంత్ వివరించారు.
పోస్ట్ న్యాయసమీక్షను ఆధిపత్యంగా చూడొద్దు మొదట కనిపించింది విశాలాంధ్ర.

