- విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు పంపిన పంతులు
- ఐదుగురిని సస్పెండ్ చేసిన విద్యా శాఖ
తుంగతుర్తి, వెలుగు: ప్రభుత్వ హైస్కూల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడానికి టీచర్ల మధ్య విభేదాలే కారణమని తేలింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి, పాఠశాల ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం జడ్పీ హైస్కూల్‌తో పాటు మరో నలుగురు టీచర్లను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
స్కూల్లో ప్రస్తుతం ఉపాధ్యాయుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగడంతో విద్యాబోధన దెబ్బతింది. ఫలితంగా హైస్కూల్ కూడా ఈ ఏడాది ఒక్క అడ్మిషన్ నమోదు కాలేదు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేవని, బోధన సరిగా ఉండదని విద్యార్థులు, తల్లిదండ్రులకు చెబుతూ వారిని ప్రైవేట్ పాఠశాలల్లో చేరాలని టీచర్లే ప్రోత్సహించినట్లు అధికారుల విచారణలో తేలింది.
స్టాఫ్ మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం, సక్రమంగా నిర్వహించకపోవడం, రికార్డులను పరిశీలించడం విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. కలెక్టర్ ముందుగా ఈ నెల 15న హెచ్ఎం ఎం.ఏ.హకీమ్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం శనివారం స్కూల్ అసిస్టెంట్లు పి.కోటయ్య, కె.సుజాత, జి.గీత, ఎస్జీటీ కె.శ్రీనివాసనాయుడును కూడా సస్పెండ్ చేస్తూ డీఈవో అశోక్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని డీఈవో విచారణ చేపట్టారు.

