క్రీడలు: 2027 ప్రపంచకప్ సమయానికి స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ గురించి మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీలో భారత జట్టు విజయం సాధించాలంటే ఈ ఇద్దరు సీనియర్ల అనుభవం అత్యంత కీలకమనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్‌ను జట్టు నుంచి క్రమంగా తప్పిస్తారనే ప్రచారం నేపథ్యంలో కైఫ్ ఈ విశ్లేషణ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌తోనే రోహిత్ కెరీర్ ముగుస్తుందనే వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే ఖండించిన విషయం విధితమే. ఓ స్పోర్ట్ ఛానల్ వేదికగా జరిగిన చర్చలో కైఫ్ మాట్లాడుతూ…’2027 ప్రపంచకప్ భారత్‌కు అంత సులువుగా ఏమీ ఉండదు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లు, భిన్నమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలంటే రోహిత్, విరాట్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండాలి. వారు ఇప్పటి నుంచే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతూ మంచి ఫామ్‌లో కొనసాగడం జట్టుకు ఎంతో అవసరం’ అని కైఫ్ వెల్లడించాడు. రోహిత్, కోహ్లీల ప్రాధాన్యతను వివరిస్తూ కైఫ్ అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో వారిని పోల్చాడు. ‘మెస్సీకి 39 ఏళ్లు వచ్చినా తన జట్టును ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చాడు. సెమీఫైనల్లో అతడు గోల్ చేయకపోయినా.. అసిస్ట్‌తో జట్టుకు తోడ్పడ్డాడు. అనుభవానికి ఉన్న శక్తి అదే. జట్టులో యువకులు మ్యాచ్‌లను ముగించగలరు, వారిని సరైన దిశలో నడిపించగలరు. అర్జెంటీనాకు మెస్సీ ఎలాంటివాడో, రాబోయే వరల్డ్ కప్‌లో భారత్‌కు రోహిత్, కోహ్లీలు అలాంటివారు’ అని కైఫ్ పేర్కొన్నాడు.
నేడు భారత్ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే...
ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో నేడు (ఆదివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే మూడో వన్డేలో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇంతవరకు జరిగిన రెండు వన్డేల్లో చెరో విజయం సాధించి 11 పాయింట్లతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి రెండు జట్లు. నేటి మ్యాచ్ ఫలితంతో సిరీస్ ఎవరు కైవసం చేసుకుంటారనేది తేలనుంది. టీ 20 సిరీస్‌లో ఘోర పరాజయం చెందిన బ్రాండ్ సిరీస్‌తో స్వదేశానికి చేరుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. జట్టులో అనుభవజ్ఞులైన కోహ్లీ, రోహిత్‌ల జోడీ జట్టుకి మరింత బలాన్నిస్తుంది. కెప్టెన్ శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, భూమ్రా వంటి యువ క్రికెటర్లు దూకుడు మీదున్నారు.

