ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు అన్న సామెత ఇప్పుడు ఏపీలోని విపక్షం వైసీపీకి సూటిగా సరిపోతుందని చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపించి.. ఎన్నికల్లో ఇక ఆయన ప్రస్తావన లేకుండా చేద్దామని పార్టీలు ఆలోచిస్తున్నాయని, అందులో భాగంగానే ఎన్డీఏ రథసారథి బీజేపీకి చెందిన కీలక నేతలతో కూటమి పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు, అయితే ఆ చర్చలు అంతగా ఫలప్రదం కావడం లేదని వైసీపీ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన తీరు ఇప్పుడు తెర లేపింది. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీ మెడకే చుట్టుకున్న వైనం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
జగన్ ను అరెస్టు చేసే దిశగా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినట్లుగా నాగేశ్వర్ చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ అరెస్టును నోట నుంచి విన్న అమిత్ షా పవన్… జగన్ చిరకాల మిత్రుడని, చంద్రబాబు మాత్రం పార్ట్ టైం మిత్రుడు మాత్రమేనని చెప్పారని నాగేశ్వర్ కథనం అల్లేశారు.
ఇంకా జగన్ అరెస్టు చంద్రబాబుకు అవసరం కావొచ్చు… దానితో మీకేం పని అని కూడా పవన్ ను అమిత్ షా ప్రశ్నించినట్లు నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఈ విషయాలు జనసేన కోర్ కమిటీ సమావేశంలో చర్చకు రాగా… సమావేశంలో పాలుపంచుకున్న తనకు చెప్పారంటూ నాగేశ్వర్ చెప్పిన విషయం తెలిసిందే.
ఇదే పార్టీకి పక్కాగా వినియోగించుకున్న వైసీపీ వైరి వర్గీయులు… బీజేపీని మతతత్వ పార్టీగా అభివర్ణించిన జగన్… అదే పార్టీకి శాశ్వత మిత్రుడిగా ఉన్న అమిత్ షాతోనే చెప్పారని చెప్పారు. మరి జనానికి తెలియని ఈ వాస్తవాన్ని స్వయంగా వైసీపీ అనుకూల విశ్లేషకులే ఇప్పుడు బయటపెట్టారని, జగన్ నిజ నైజం ఇదంటూ పార్టీల అనుకూల వర్గాలను దెప్పి పొడుస్తున్నాయి.
ఇంకా… తాను బీజేపీతో కలవనే కలవనంటూ ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా జగన్ వేయించుకున్నారని, ఇప్పుడు ముస్లింలకు వైసీపీనే సమాధానం చెప్పాల్సి ఉందని కూడా ఆ వర్గాలు వాదిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… ప్రొఫెసర్ నాగేశ్వర్ తో ఈ కథను అల్లించి మరీ ఆయన చేత చెప్పించింది మరోవరో కాదని, వైసీపీ అధిష్ఠానమేనని ఆ పార్టీకి చెందిన మరో అనుకూల విశ్లేషకుడు పాషా వాదిస్తున్నారు.
అంటే… జనసేనతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను బద్నాం చేయడానికి ప్లాన్ వేసిన వైసీపీ చివరాఖరుకు తానే బోనులో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటోందన్న వాదనలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరినో ఇరికించబోయిన వైసీపీ తానే అడ్డంగా బుక్కైన తీరుపై ఇప్పుడు పెద్ద చర్చలే నడుస్తున్నాయి.

