ఆంధ్ర ప్రదేశ్ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ ను సంతృప్తి పరచడం అంత తేలిక కాదు
ఆంధ్రప్రదేశ్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ ను సంతృప్తి పరచడం అంత తేలిక కాదు. అలాగని తాను చెప్పినట్లే నడవాలని అనుకుంటే అది కూడా సాధ్యం కాని పని. ఇప్పటి వరకూ ఒక ఎత్తు.. ఇకపై మరొక ఎత్తు అన్న పరిస్థితిలో జనసేన ఉంది. సాధారణ ఎన్నికలు వేరు. ఆ సమయం సపరేట్. కానీ ఇప్పుడు ఎవరూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేరు. రాజీ పడితే జనసేన క్యాడర్ కూడా రాజీనామా బాట పడుతుంది. అలాగని పంతానికి పోయినా ఒంటరిగా పోటీ చేసే గెలవగల కాంతి, శక్తిని ఇప్పటి వరకూ జనసేన పార్టీ కూడగట్టుకోలేదు. పవన్ ఫేమ్ పైనే ఇంకా ఆధారపడి ఆ పార్టీ నడుస్తుంది.
మాట మార్చింది అందుకే…
జనసేన కు నాదెండ్ల మనోహర్ మన బలం ఉన్న చోట మాత్రమే పోటీ చేసిన మంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. కానీ కార్యకర్తలు ఊరుకోలేదు. పన్నెండేళ్లవుతున్నా జనసేన బలం పెరగడానికి, పెంచుకోకపోవడానికి కారణాలేంటి? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. చివరకు కేఏ పాల్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తామని. కార్యకర్తల్లో ధైర్యం నూరిపోయడానికే ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాగే అంటుంది. కానీ నాదెండ్ల మనోహర్ బలమున్న చోట మాత్రమే పోటీ చేయడం, ఫ్లెక్సీలు, నినాదాలు చేసినంత మాత్రాన బలం పెరిగినట్లు కాదని అనడంపై కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
పవన్ నిర్ణయమే ఫైనల్…
దీంతో వెనక్కు తగ్గిన నాదెండ్ల మనోహర్ 2024 ఎన్నికలు వేరు.. ఇప్పుడు వేరు.. ఇప్పుడు తక్కువ స్థానాలు ఇస్తామంటే తగ్గమని చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయనకు క్షేత్రస్థాయిలో క్యాడర్ లో ఉన్న అభిప్రాయాన్ని గుర్తించి మాట మార్చారు. నాదెండ్లది నిర్ణయాల్లో ఏమీ ఉండకపోవచ్చు. రేపు సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్ చంద్రబాబును ఒప్పించగలరా? లేక సర్దుకుపోవాలని నిర్ణయిస్తారా? అన్నది ఆయనే తేల్చాల్సిన విషయం. పవన్ కల్యాణ్ కు ఈ సమస్య నుంచి బయటపడటం ఆషామాషీ కాదు. ఎందుకంటే కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అన్నట్లుగా ఉంది. ఇప్పుడు పవన్ తీసుకునే నిర్ణయంపైనే పార్టీ భవిష్యత్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వార్తల సారాంశం – ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాజీ పడతారా లేక మాట మీద నిలబడతారా?

