హీరో ఒక మారుమూల ప్రాంతంలో రికార్డులలో లేని ఊర్లో కొండ ప్రాంతంలో కొండ కింద పల్లెలో ఉండే సాధారణ కూలి. ఆ 180 గడపలు ఉన్న ఊరు రికార్డులలో ఉండదు అందుకే వారికి ఆధార్ కార్డులు కానీ ఓటు హక్కు గాని ఉండదు. హీరో మట్టిలో మాణిక్యంలా అతనికి ఓ టాలెంట్ ఉంటుంది అతను ఏ గేమ్ అయినా ఆడగలడు ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే ఒకరికి ఒక గేమ్‌లో టాలెంట్ ఉంటే మిగిలిన గేమ్‌లలో కూడా అతను టాలెంట్‌ను తొందరగా అక్వయిర్ చేసుకోగలడు. హీరోకు క్రికెట్ లో మంచి టాలెంట్ ఉంది.. అతని మన IPL మాదిరి విలేజ్ లో జరిగే పోటీలలో పాడుకుంటూ ఉంటారు.. కానీ పల్లెటూరు కాబట్టి వాళ్లను కూలి నా కొడుకులు అని అంటారు.
అక్కడ అతనికి ఓ చిన్న సమస్య రావడంతో అతను ఆ క్రికెట్ గేమ్ నుంచి కుస్తీ పోటీల గేమ్ కు షిఫ్ట్ అవుతాడు. అందులో కూడా పరిణతి సాధించి అక్కడ నుంచి నేషనల్ లెవెల్ కు వెళ్లే కి రెడీ అయ్యాడు.. కానీ తోటి ప్లేయర్ చేసిన ఇంజరీతో అతని కాళ్ళకు దెబ్బ తగిలి అతను ఫైనల్స్ లోకి వెళ్లలేదు. తరువాత తనకు గుర్తింపు తన ఊరికి గుర్తింపు కావాలి అంటే అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ కావూన అక్కడ రైలు ఆగాలి అని రైలు స్టాప్ కోసం పోరాడుతున్న జగపతిబాబు క్యారెక్టర్ అప్పల సూరితో కలిసి అతను చనిపోవడం వల్ల ఆ బాధ్యతను అతను తీసుకుంటాడు. కానీ గెలిచిన వాడి మాటలనే ఎక్కడైనా వింటారు తప్పితే ఓడిన వాడి మాటలను ఎవరు వినరు అంటే కాన్సెప్ట్ అర్థం అవుతుంది. కానీ గెలవాలి అంటే కాళ్లకు దెబ్బ తగిలి అతను ఒక అనహ్యమైన స్టెప్పు తీసుకొని పారా ఒలింపిక్స్‌లో రన్నర్‌గా చేరి రన్నింగ్ రేస్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు.. అప్పుడు అతనికి నేషనల్ లెవెల్ లో గుర్తింపు వస్తుంది. అభివృద్ధికి ఆమడ దూరం ఏ రికార్డులు లేకుండా కనీసం గుర్తింపు లేని గ్రామం ఒక మంచి గ్రామంగా మారిపోతుంది.
ఇది స్టోరీ లైన్ ఎక్కువ ట్విస్టులు చెబితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి చెప్పలేదు అనూహ్యమైన అద్భుతమైన స్టోరీ లైన్ మనం స్పోర్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చెక్ దే ఇండియా మరియు భద్రాచలం లాంటి సినిమాలు చూశాం.. కానీ ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ మరియు ఇన్వాల్వ్మెంట్ ఒక మరియు సోషల్ కాజ్ పర్సనల్ ఫేమ్ కాకుండా చాలా ఆసక్తిగా ఉంటుంది. అత్యద్భుతమైన రామ్ చరణ్ నటన మరియు పీక్ పెర్ఫార్మన్స్‌లో సంగీతం అందించిన ఎఆర్ రెహమాన్ సంగీతం దీనికి మంచి హైలెట్స్ బిజిఎం సూపర్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి కధను నడిపిస్తాయి. జగపతిబాబు నటన కూడా హైలైట్ గా ఉంది. శివరాజ్ కుమార్ నీటిని కూడా సూపర్ మిగిలిన చాలామంది నటులు ఉన్నా కానీ వారిదంతా ఊతూతికే నటన.. డైరెక్టర్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మొదటి సగం లో అక్కడక్కడ కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపించినా కానీ సినిమా పుంజుకుంటూ ఉంటుంది.. సినిమా నిడివి మూడు గంటలు కాకుండా రెండున్నర గంటలకు చేసి ఉంటే బాగుండేది.. కాకపోతే అన్ని రకాల ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి కాబట్టి ఆ జాహ్నవి కపూర్ అనబడే అచ్చాయమ్మతో కొన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టడం అనవసరమే అయినా తప్పదు. ఐటమ్ సాంగ్ ఉండాలి కాబట్టి పెట్టారు గాని దాని అవసరము లేదు.
ఇదే కథతో మలయాళంలో వచ్చి ఉంటే ఆహా ఓహో సూపర్ కంటెంట్ అని అనేవాళ్ళు ఎందుకో తెలుగు ఆడియన్స్ కు మంచి కథతో తీసిన సినిమా తప్పకుండా నచ్చాలి. ఇందులో సీన్లు నచ్చలేదు కానీ.. కానీ అన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి తీయవలసిన సినిమా అయితే కాదు.. అది మనకు అనవసరమైన విషయం, మనకు సినిమా అయితే చాలా బాగుంది.. కాకపోతే మూడు గంటలు ఉంది. మొదట గంటసేపు కొంచెం ఓపికగా చూస్తే మిగిలిన రెండు గంటలు ఇక మీకు తెలియకుండా ఇట్టే గడిచిపోతుంది. ఇంత మంచి స్టోరీ కంటెంట్ ఉన్న సినిమా ఈ మధ్యన తెలుగు సినిమాలలో రాలేదు.. డి గ్లామరైజ్డ్ పాత్ర డిగ్లామరైజ్డ్ లుక్స్ ఉన్న ఈ పాత్రను రామ్ చరణ్ ఎందుకు చేసాడో అన్నట్లు మనకు అనిపిస్తుంది కానీ అతను ఈ పాత్ర స్టోరీ కంటెంట్ మింద ఇన్స్పైర్ అయ్యి తీశాడు అని అనుకోవచ్చు. మంచి కథ ఉంది. మంచి హీరో మంచి సంగీతం మంచి బిజిఎం అందాల ఆరబోతకు జాహ్నవి.. ఐటమ్ సాంగ్ కు శృతిహాసన్.. అందరికీ కావలసినవి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాను చూడవచ్చు.. మనలను నిరాశపరచదు.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

