బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. తెలుగులో ‘1 నేనొక్కడినే’, ‘దోచేయ్’ లాంటి ఫ్లాప్ సినిమాల్లో నటించినా.. హిందీలో మాత్రం ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది కృతి. ఇటీవలే ‘కాక్ టైల్-2’లో రష్మికతో కలిసి నటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ‘తేరే ఇష్క్ మే’ చిత్రంతోనూ ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకుంది.
బాలీవుడ్ స్టైల్‌కు తగ్గట్లు గ్లామర్‌తో ఆకట్టుకుంటూనే పెర్ఫామెన్స్తోనూ మెప్పించే అరుదైన కథానాయికల్లో కృతి ఒకరు. ఆమెకు ఇప్పటికే 35 ఏళ్లు వచ్చేశాయి. కానీ కెరీర్ గొప్పగా సాగుతోంది. దీనితో పెళ్లి వైపు ఇంకా ఆలోచనలు మళ్లలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆమెకు కనిపించడం లేదు. కానీ చాలా ఏళ్ల కిందటే పిల్లల కోసం ఆమె ప్లానింగ్ చేసిందట.
కృతి కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రాలలో ఒకటైన ‘మిమి’లో నటిస్తున్న సమయంలోనే ఆమె భవిష్యత్తుల్లో పిల్లలు కనడంలో ఏ ఇబ్బంది రాకుండా ఉండేందుకు తన అందాలను దాచి పెట్టిందట. ఈ కార్యక్రమం తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృతి.
మిమి సినిమాలో సరోగేట్ మదర్‌గా ప్రెగ్నెంట్ రోల్ చేయడం కోసం 15 కిలోల బరువు పెరిగింది కృతి. పాత్ర కోసం అలా బరువు పెరగమని ‘మిమి’ మేకర్స్ చెప్పినప్పుడే తనకు అందాలు దాచిపెట్టాలన్న ఆలోచన వచ్చిందని ఆమె చెప్పింది. భవిష్యత్తులో వయసు ఎక్కువ, ఇంకా అనేక సమస్యలు తలెత్తితే పిల్లల్ని కనడంలో ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో తన అండాలను దాచే ప్రక్రియలో భాగమైనట్లు కృతి చూపుతుంది.
”అవును. నేను నా అందాలను దాచిపెట్టాను. ఫలానా సమయంలో పెళ్లి చేసుకోవాలి, ఫలానా వయసులో పిల్లల్ని కనాలి అంటూ ఒక టైం లైన్ నిర్ణయించుకునే అవసరం లేకుండా.. వయసు పెరిగాక ఎదురయ్యే సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ పని చేశాను. పెళ్లి అయినా, పిల్లలైనా మన మనసుకు అనిపిస్తేనే ముందడుగు వేయాలి.
టైంను బట్టి, ఎవరి ఒత్తిడితోనో ఆ నిర్ణయం తీసుకోలేదు. అందుకే అందాలు దాచిపెట్టాను. ఇది అందరికీ సాధ్యమయ్యే ప్రక్రియ కాదు. నా వల్ల అయింది కాబట్టి నేను చేసుకోగలిగాను. ఇది చాలా మంచి నిర్ణయమని, నీకు నువ్వు ఇచ్చుకునే పెద్ద గిఫ్ట్ అని ఒక వ్యక్తి చెప్పారు. అందాలు దాచిపెట్టడం అన్నది చిన్న విషయం కాదు. అది ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇదంత తేలికైన ప్రక్రియ కాదు” అని కృతి చెప్పింది.

