పెళ్లి చూపులు | తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘పెళ్లిచూపులు’ విడుదలై నేటికి (జులై 29) పదేళ్లు పూర్తయ్యాయి. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 2016లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక సంపాదించుకుంది.
పెళ్లి చూపులు | తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘పెళ్లిచూపులు’ విడుదలై నేటికి (జులై 29) పదేళ్లు పూర్తయ్యాయి. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 2016లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక సంపాదించుకుంది. దర్శకుడిగా తరుణ్ భాస్కర్ పరిచయమైన ఈ ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. వినోదభరితమైన కథనం, వినోదభరితమైన సంభాషణలు, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, అప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని సహజ ప్రతిభావంతులకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టింది.
‘పెళ్లిచూపులు’ విజయ్ దేవరకొండ కెరీర్లో కీలక మలుపు తిరిగింది. సోలో హీరోగా ఆయనకు ఇది తొలి పెద్ద విజయం. విజయ్ నటన, సహజమైన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు అందుకున్న విజయ్, ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన రీతూ వర్మ తన సహజమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకున్న ప్రముఖ కథానాయిక గుర్తింపు పొందింది.
ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి సినిమాతోనే తన ప్రత్యేక శైలిని నిరూపించుకున్నారు. ‘పెళ్లిచూపులు’ తర్వాత టాలీవుడ్లో క్రేజీ దర్శకుడిగా ఎదిగిన ఆయన, అనంతరం నటుడిగానూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.బాక్సాఫీస్ దగ్గర మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పెళ్లిచూపులు’ అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రం రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు లభించాయి. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ జాతీయ పురస్కారం అందుకోగా, ఉత్తమ మాటల రచయితగా దర్శకుడు తరుణ్ భాస్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు.
అలాగే 2016 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి విభాగంలో రెండు నంది అవార్డులు కూడా ప్రకటించబడ్డాయి. ఇందులో రీతూ వర్మ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. అయితే ఆ సమయంలో నంది అవార్డుల ప్రదానోత్సవం జరగలేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర సినీ పురస్కారాల్లో కూడా ‘పెళ్లిచూపులు’కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సెకండ్ బెస్ట్ మూవీగా ఎంపిక చేసి చిత్రబృందాన్ని సత్కరించింది. దీంతో విడుదలైన పదేళ్లు పూర్తయిన ‘పెళ్లిచూపులు’ ప్రస్థానం ఇంకా కొనసాగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

