యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఎర్రగుంట వద్దగల యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ కమిటీ వారు ఇటీవల పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాల గుండ్ల మల్లికార్జున, జనరల్ సెక్రెటరీ కప్పల బలరాముడు, కోశాధికారి బండి ఉజ్జినప్ప మాట్లాడుతూ 2026 సంవత్సరపు పదవ, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో కురుబ కులస్తుల విద్యార్థులు అత్యధిక మార్కులతో రావడం నిజంగా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రధమ బహుమతిగా 3 వేల రూపాయల నగదుతో పాటు మెమొంటో, ద్వితీయ బహుమతిగా 2,500 రూపాయలు నాగదితో పాటు మెమొంటో, తృతీయ బహుమతిగా 2000 రూపాయల నగదుతో పాటు మెమొంటో అందజేయడం జరిగింది. తదుపరి పదవ తరగతిలో 50 మంది 500 మార్కులు సాధించిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల నగదుతో పాటు మెమొంటోలు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 25 మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలతో పాటు మెమొంటోలను ఇస్తూ, విద్యార్థులకు ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా జేఈఈ మెయిన్స్, ఎన్ ఈటీ, కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన 8 మందికి కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోటి వెంకటేష్, ఎజ్జన, గవరనారాయణ స్వామి, డైరెక్టర్లు కేసీ నారాయణస్వామి, చిలిపి ఆంజనేయులు, సహకార దర్శి పూల గుండ్ల నాగార్జున, ఉప కోశాధికారి పామాల విజయభాస్కర్, గిరకే నాగేంద్ర, బెల్లం తిరుపాల్, డైరెక్టర్లు ఉన్నారు.

