- సామినేని రామారావు హత్యపై ‘సిట్’ విచారణ.. నిందితులను విడిచిపెట్టేది లేదు
- మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇండ్లు.. ఆ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడి
- సెక్రటేరియెట్లో సీఎంతో సీపీఐ, సీపీఎం నేతల భేటీ
హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండిచేయి చూపిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మక్కజొన్న దిగుబడి పెరిగిన నేపథ్యంలో మార్క్ ఫెడ్ ద్వారా మద్దతు ధరకే కొనుగోళ్లు జరుపుతున్నామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చామని తెలిపారు. హమాలీల కొరత, ఎండ తీవ్రత వల్ల స్వల్ప జాప్యం జరిగినప్పటికీ, నిరంతరం సమీక్షలు జరుగుతున్నాయని వివరించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఇబ్బందులు, కనీస వేతనాల సవరణ, పెండింగ్ ప్రాజె క్టులులాంటి కీలక ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో కమ్యూనిస్ట్ పార్టీల బృందం సోమవారం సెక్రటేరియట్లో భేటీ అయింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) కార్యదర్శి జాన్వెస్లీ విడివిడిగా జరిగిన ఈ సమావేశాల్లో ఖమ్మం జిల్లా సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసు విచారణ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా పక్షాన పార్టీలు లేవనెత్తిన పలు సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మూసీపై ప్రతిపక్షాలు రాజకీయం..
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి. నిర్వాసితులకు స్థానికంగానే నివాసాలు కల్పిస్తామని, నల్గొండ ప్రజల ఆరోగ్యం, నగరవాసుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మరోవైపు.. సామినేని రామారావు హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని జాన్ వెస్లీ బృందం కోరగా, సిట్సిట్ ఏర్పాటు చేసినట్లు హామీ ఇచ్చారు.
కనీస వేతనాల సవరణలో స్కిల్డ్, సెమీ -స్కిల్డ్ కార్మికులకు జరిగిన నష్టాన్ని సరిచేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీసం రూ. 26వేల వేతనం ఉండాలని నేతలు కోరగా, ఆ నివేదికలను పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం నియమించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ వైద్య రంగాల ప్రక్షాళన, ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల వంటి విద్య కూడా ఈ భేటీలో జరిగింది. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, చాడ వెంకట్ రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, కమ్యూనిస్ట్ పార్టీల ముఖ్య నేతలు

