. రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్
. ఐఆర్ఎఫ్సీతో రుణ ఒప్పందం
. భవిష్యత్ విస్తరణకు బలమైన ఆర్థిక పునాది
. ప్రజా రవాణా వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎస్.ఎస్
విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ పొందింది. ఢిల్లీలో సోమవారం ఈ ఒప్పందంపై ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్), హెచఎమఆరఎల్ మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ ప్రకటన ఐఆర్ఎఫ్సీ సీఎండీ సీఈఓ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు. ఈ సందర్భంగా ఎస్ఐఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిరమైన, ప్రజానుకూల ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిర్వహించిన కార్యక్రమం. దేశ ఆర్థిక వృద్ధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగర వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను నిక్షేపాలలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు పూర్తి ఆర్థిక సహాయం లభిస్తుందని, దీని వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. రుణ భారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలకు ఇది దోహదపడుతోంది. ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ, హెచఎంఆర్ఎల్, సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లార్సెన్ అండ్ టుబ్రో నుంచి ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అనంతరం ఈ రీఫైనాన్సింగ్ అమలులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయి ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యూహం ప్రజా రవాణా ఆస్తిగా మారింది. రూ.13,600 కోట్ల రుణ బాధ్యతలైన నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు … వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్‌కు వినియోగించనున్నారు. దీని ద్వారా ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ లభించడంతో పాటు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం మెరుగుపడనుంది. ఈ రుణాన్ని 20 సంవత్సరాల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల విధానాన్ని రూపొందించారు. అధిక రుణాలను తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రూపాయి ఫైనాన్సింగ్‌తో భర్తీ చేస్తున్నారు. ఈ లావాదేవీకి తెలంగాణ ప్రభుత్వ నిర్బంధ… కచ్చితమైన చెల్లింపు హామీ, రాష్ట్ర ప్రభుత్వ గ్యాటీ, ఆర్బీఐ మద్దతుతో డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ వ్యవస్థ మద్దతుగా నిలిచాయి. 69.2 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటి. ప్రస్తుతం ఈ నెట్వర్క్ ద్వారా రోజుకు ఐదు లక్షలకు పైగా ప్రయాణికులు సేవలు పొందుతున్నారు. ఈ రీఫైనాన్సింగ్ వల్ల హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఆర్థిక సామర్థ్యం మరింత బలోపేతం కావడంతోపాటు కొత్త కారిడా, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, చివరి మైలు కనెక్టివిటీ వంటి విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి అవకాశం కలుగుతుంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులకు బలమైన ఆర్థిక పునాది ఏర్పాటు చేయడంలో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయిగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సుస్థిరమైన, సమర్థవంతమైన మరియు పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థ నిర్మాణంలో ఇది ముఖ్యమైన ముందడు గుగ నిలవనుంది. హెచఎంఆర్ఎల్ మేనేజింగ్ సర్ఫరాజ్ అహ్మద్, జైంట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథóŠకాల సమన్వయ ప్రత్యేక డైరెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) ప్రతినిధి కె.వి.బి. రెడ్డి, సీఎఫ్‌వో ఈ.వి.ఆర్. శ్రీనివాస శర్మతో పాటు ఐఆర్ఎఫ్సీ, ఇతర శాఖలు ఉన్నాయి.
పోస్ట్ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదట కనిపించింది విశాలాంధ్ర.

