తెలంగాణ:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్( మంత్రి బండి సంజయ్ ) కి సద్బుద్ధిని ఇవ్వమని బిఆర్ఎస్ పార్టీ మహిళ నేతలు మాజీ ప్రభుత్వ విప్,ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత(ఎమ్మెల్యే గొంగిడి సునీత ),కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ఆధ్వర్యంలో సోమవారం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…బండి సంజయ్ కేంద్ర మంత్రి సహాయనిధిగా ఉన్నంతకాలం పోలీసులు గాని,ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, బాలిక పెట్టిన కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి, తప్పును తప్పని ఒప్పుకోమని అందరికీ ఒకే న్యాయమని చెప్పిన బండి సంజయ్ మాట నిజం చేసేటట్టు బండి సంజయ్ కి మానసిక శక్తిని ఇవ్వమని, వీలైతే తన మంత్రి పదవికి రాజీనామా చేయడమంటే, రాష్ట్ర పోలీసులు ఇంకా ఆలస్యం చేయకుండా వెనువెంటనే చట్టం ప్రకారం బండి సాయి భగీరథ మీద చర్యలు తీసుకుంటారని, అమ్మవారిని వేడుకున్నామన్నారు.

