వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: కేంద్రం మరో కీలకమైన చట్టాన్ని తీసుకురాబోతోంది. 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైల్లో గనక ఉండి ఉంటే ప్రజాప్రతినిధులు తమ పదవిని కోల్పోవలసి ఉంటుంది. ఈ ప్రతిపాదనను తీసుకురావాలని బిజెపి పెద్దలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కావలసినంత బలం లేకపోవడంతో.. సభ ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడు బిజెపికి కావాల్సినంత బలం ఉంది.
ఎంతో కీలకమైన ఈ బిల్లుకు దేశంలో మెజారిటీ రాజకీయ పార్టీలు జై కొడుతున్నాయి. అయితే ఈ బిల్లుకు ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసిపి నో చెప్పింది. వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ఈ బిల్లుకు సంబంధించిన చర్చ.. ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారు ఎవరైనా సరే పదవికి దూరం కావాల్సిందే.
చట్టసభల్లో నేరస్తులు పెరిగిన నేపథ్యంలో వారి సంఖ్య తగ్గించడానికి మోడీ ప్రభుత్వం ఈ కఠినమైన చట్టాన్ని తీసుకొస్తుంది.. ప్రధానమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరైనా సరే 30 రోజులపాటు జైలు లేదా జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే పదవి కోల్పోతారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ఏకంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తెరపైకి తీసుకురావాలని భావించింది. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత నాయకులు పదవిని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిబంధన ప్రకారం ఏదైనా కోర్టులో రెండు సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడితేనే ప్రజాప్రతినిధుల మీద అనర్హత వేటు పడనుంది.
వైసిపి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ఒకరకంగా ఆచారాన్ని కలిగిస్తుంది.. బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైసీపీ జై కొట్టింది.. కానీ ఇప్పుడు మాత్రం వైసిపి కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు నో చెప్పడం చర్చకు దారితీస్తోంది. అయితే దీని వెనుక వైసీపీ నేతల సొంత భయాలు దాగి ఉన్నాయి.
అక్రమ ఆస్తుల కేసులో జగన్ మీద ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగుతున్నాయి. ఆ విచారణ కూడా చివరి దశలో ఉంది. గతంలో 16 నెలల పాటు జగన్ జైల్లో ఉన్నారు. ఇక ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాలలో జరిగిన అక్రమాలపై విచారణ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ జగన్ అరెస్టు కావచ్చు అని ప్రచారం కూడా ఉంది.. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చే చట్టం అమల్లోకి వస్తే జగన్ మరొకసారి గనుక 30 రోజులపాటు జైలుకు వెళ్లాల్సి వస్తే వైసిపికి సమస్యలు తప్పవు. అందువల్ల జగన్ రక్షించుకోవడానికి.. కేంద్రం తీసుకొచ్చిన వ్యతిరేకంగా ఉందని. ఒకవేళ ఓటింగ్ వరకు వెళ్తే భయం వల్ల వైసీపీకి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఏం చేస్తుందో..

