భార్యకు భరణం విషయంలో ముంబై హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. భర్త కంటే ఎక్కువ సంపాదించే భార్యకు జీవనభృతి కింద భరణం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. న్యూజెర్సీ ఓ మహిళ తన భర్తనుంచి భరణం కోరుతూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయమూర్తి..పిటిషన్ తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూజెర్సీలో పిటిషనర్ ఆదాయం నెలకు రూ. 8లక్షలు ఉండగా.. అది ఆమె భర్త సంపాదన కంటే ఎక్కువ. విదేశాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉండేందుకు కారణం చూపుతూ ఆమె భర్త నుంచి మధ్యంతర భరణం కోరింది. కోర్టు అభ్యంతరం చేసింది.
అంతకుముందు కూడా ఇదే కేసులో విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు కూడా ఆమె భరణం పిటిషన్‌ను తిరస్కరించింది. పిటిషనర్‌కు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒకరు తండ్రి సంరక్షణలో ఉన్నారు. మరొకరు తల్లి సంరక్షణలో ఉన్నారు. అయితే ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.

