భారత క్రికెట్ జట్టుపై పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైట్ బాల్ క్రికెట్లో సరిగ్గా తిరుగులేదని, పవర్ఫుల్ టీమ్ అని కొనియాడాడు. పాకిస్థాన్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతీ జట్టు భారత్‌ను ఓడించడానికి ఇబ్బంది పడుతుందని తెలిపాడు. ఇటీవల పాకిస్థాన్ జట్టు ప్రదర్శనలపై వస్తున్న విమర్శలకు మైక్ హెస్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘గతేడాది ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు మినహా అన్ని మ్యాచ్‌ల్లో మేం గెలిచాం. వాస్తవం ఏంటంటే ప్రస్తుతం ప్రపంచంలో ఏ జట్టైనా భారత్‌ను ఓడించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కేవలం పాకిస్థాన్ మాత్రమే కాదు.. ప్రతి జంట ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది.
ఫోటో క్రెడిట్: X (twitter)
తప్పో ఒప్పో పక్కన పెడితే భారత్‌తో ఆడేటప్పుడు పాకిస్థాన్ ప్రదర్శన ఎలా ఉందన్న దాని ఆధారంగానే ఆ జట్టును అంచనా వేస్తారు. ప్రస్తుతం అత్యుత్తమ జట్టు మాత్రమే కాదు.. మిగిలిన జట్ల కంటే ఎంతో ముందుండి మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. పాకిస్తాన్ పెద్ద టోర్నీల నాకౌట్ దశల్లో నిలకడగా చోటు దక్కించుకున్న జట్టుగా ఎదగాలంటే అన్ని జట్లపైనా క్రమం తప్పకుండా విజయాలు సాధించాల్సి ఉంది.’అని మైక్ హెస్సన్ అభిప్రాయపడ్డాడు.
ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్‌తో ఫైనల్‌తో సహా మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్.. ఈ మూడింటిలోనూ ఓటమి పాలైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో దాయాదీ దేశాలు ఒకసారి తలపడగా భారత్‌నే విజయం సాధించింది. వైట్ బాల్ క్రికెట్లో సరిగ్గా ఎదురు లేకుండా పోయింది.
ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓడినా.. వరుసగా మూడు టోర్నీల్లో (ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024, 2026) భారత్ విజేతగా నిలిచింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో వరుసగా 16 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన భారత్.. ఇటీవలే పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్.. తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20 శనివారం జరగనుంది.
కథనం మొదట ప్రచురించబడింది: శుక్రవారం, జూలై 3, 2026, 11:32 (IST)
ఇతర కథనాలు ప్రచురించబడ్డాయి జూలై 3, 2026

