యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరిలో దారుణం జరిగింది. మృతదేహంపై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును దుండగులు మాయం చేశారు. భువనగిరి మూడు ఆసుపత్రిలో చనిపోయిన మహిళ మెడ నుంచి తులాల బంగారు పుస్తెల తాడు మాయమైన ఘటన కలకలం రేపింది. వలిగొండ (మ) వర్కట్ పల్లికి చెందిన సుష్మిత అనే గర్భవతికి దమ్ము ఎక్కువగా వస్తుంది అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆమె భర్త నాగరాజు ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు.
తెల్లవారుజామున నాలుగు గంటలకు సుస్మిత చికిత్స పొందుతూ చనిపోయింది. పోస్టుమార్టం సమయంలో సుస్మితపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకోని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమె ఒంటిపై ఉన్న బంగారం గురించి చూడగా.. అప్పటికే ఆమె మెడలోని మూడు తులాల పుస్తెల తాడు కనిపించలేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు పోలీసులకు సుస్మిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

