ప్రపంచంలోని టాప్ 50 హాటెస్ట్ నగరాలు: సరిగ్గా మూడు రోజులక్రితం ఉత్తర ప్రదేశ్లో 46కు మించిన ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత సీజన్లో ఇదే హైయెస్ట్ రికార్డు అనుకుంటే.. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో టెంపరేచర్ రికార్డు అవుతోంది. భయానికి వెళ్లాలంటేనే భయం కలుగుతోంది. ఒకవేళ బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామా అనే ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ఎండలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. ఎండలు ఇలా పెరుగుతున్న ప్రజలు నరకం చూస్తున్నారు. డీ హైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు కూడా ఉన్నారు.
శుక్రవారం రోజున సగటున 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు వడగాలులు కూడా తీవ్రంగా వీచాయి. వడదెబ్బ మరణాలు కూడా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ హీట్ నగరాలు కూడా మనదగ్గర నమోదయ్యాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వడగాలుల వల్ల శుక్రవారం మధ్యాహ్నం వరకు 40 డిగ్రీలు మించి టెంపరేచర్ రికార్డయింది.
ఒడిశాలోని బాలన్ గిర్ ప్రాంతంలో ఏకంగా 45 ఉష్ణోగ్రత నమోదైంది. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ట్రాకర్ ఈ పక్కన పెట్టింది. చంద్రాపూర్(మహారాష్ట్ర), ప్రయాగ్ రాజ్(ఉత్తరప్రదేశ్), ఛత్తీస్ గఢ్, బిహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదైంది. టాప్ 50 నగరాలలో సగం ఉత్తర ప్రదేశ్ లోనే ఉన్నాయి. ఇప్పటికే వాయవ్య, మధ్యభారత ప్రాంతంలో వడగాలులు చుక్కలు చూపిస్తున్నాయి. అనేక ప్రాంతాల రెడ్, ఆరెంజ్ అలర్ట్ లను వాతావరణ శాఖ జారీ చేసింది.
శుక్రవారం మధ్యాహ్నం వరకు వాతావరణ శాఖ విడుదల చేసిన వరల్డ్ హాట్50 నగరాలలో అన్ని కూడా మనదేశంలోనే ఉన్నాయి. వేడి మాత్రమే కాదు, వడగాలుల తీవ్రత మనదగ్గర అధికంగా ఉంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం, పారిశ్రామికకరణ, చెట్లను నరకడం వంటి పరిణామాలు ఎండ వేడిమి పెరగడానికి దోహదం చేస్తున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

