– ప్రకటన –
నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు గురువారం జరిగాయి. మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహం, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. యువతకు సాంకేతిక రంగాన్ని పరిచయం చేసి, దేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి నాయకులు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లిరెడ్డి , జిమ్ రవి, కోల వెంకటేష్, బాలు రెడ్, వాసు, రవికాంత్ రెడ్డి, గిరి, అజ్జు భాయ్, మీసాల రవి ఉన్నారు.
– ప్రకటన –

