తెలంగాణ:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్(హుజూర్నగర్) నియోజకవర్గంలోని పాలకవీడు,నేరేడుచర్ల మండలాలకు చెందిన పలువురు కార్యకర్తలు పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ( జగదీష్ రెడ్డి )మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు,గతంలో ఇచ్చిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతోనే పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారు.ప్రజల ఆశీస్సులతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.
ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి,అరిబండి సురేష్ బాబు,క్రిష్టిపాటి అంజిరెడ్డి ఉన్నారు.

