మొన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వచ్చి డ్రాగన్ గ్లిమ్ప్స్ అభిమానులను ఫుల్ హ్యాపీ చేసింది. సోషల్ మీడియా స్పందన ఎలా ఉన్నా కెరీర్ లోనే అత్యంత భారీ యాక్షన్ గ్రాండియర్ లో తమ హీరోని చూడబోతున్నామన్న ఆనందం వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేంత సంతోషాన్ని మిగిల్చింది. వచ్చే ఏడాది కేవలం ఆరు నెలల గ్యాప్లో రెండు భాగాలు రిలీజ్ అవుతాయనే లీక్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మరింత పెరిగింది. సరే ఇదంతా సంతోషపడాల్సిన విషయమే.
కానీ 2025 తారక్ పుట్టినరోజుకి దేవర 2 అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈసారి మాత్రం కేవలం శుభాకాంక్షలతో సరిపెట్టింది. అంటే దేవర 2 లేదనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఎందుకంటే దర్శకుడు కొరటాల శివ అటు బాలకృష్ణ ప్రాజెక్టులో బిజీ అయిపోయారు. దానికో ఆరేడు నెలలు కేటాయించబోతున్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ (ప్రచారంలో ఉన్న టైటిల్) సెట్స్ లో అడుగు పెట్టాల్సి ఉంటుంది.
అంటే ఇంకో రెండేళ్లకు పైగా తారక్ డైరీ ఖాళీగా ఉండదు. బాలకృష్ణ సినిమా పూర్తి చేసుకున్నాక కొరటాల శివ అంత గ్యాప్ ఖాళీగా ఉండటం కష్టం. ఇప్పటికే ఏడాదిన్నర వెయిటింగ్ లోనే గడిచిపోయింది. సో దేవర 2 రూపొందించిన అవకాశం మెల్లగా సన్నగిల్లడంతో ఆ ఆలోచన మానుకున్నారేమో అనే సందేహం కలగడం సహజం. మొన్న బర్త్ డే రోజు త్వరలో ఉంటుందనో లేదా దేవర 2 ఆగమనం జరిగి తీరుతుందనో ఒక్క మాట చెప్పి ఉంటే ఈ డిస్కషన్ జరిగేది కాదు.
ఏది ఏమైనా ఏదో ఒక సందర్భంలో కొరటాల శివ దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తే బెటర్. దేవర భారీ విజయం అందుకుంది కానీ మరీ కెజిఎఫ్, పుష్ప రేంజ్ లో ఫ్రాంచైజ్ హైప్ రాలేదన్నది వాస్తవం. ఒకవేళ అలా జరిగితే త్రివిక్రమ్ కన్నా ముందు దేవర 2నే సెట్స్ పైకి వెళ్ళేదేమో. దీనికి చాలా త్వరగా చెక్ పెట్టాలి. దేవరలో నటించిన జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తర్వాత పెద్దగా దేవర 2 ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడటం గమనించాల్సిన విషయం.

