రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ పై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం రాత్రి.. భగీరథను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశీలన బండి సంజయ్ మాట్లాడుతూ.. “చట్టంపై గౌరవంతో మా అబ్బాయిని పోలీసులు అప్పగించారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఫిర్యాదు రాగానే పీఎస్‌లో అప్పగిద్దామనుకున్నా. ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి చెబుతున్నాడు. లాయర్లను సంప్రదించి తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు ముందుంచాడు. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది”
మరోవైపు, బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి తెలిపారు. నార్సింగిలోని పోలీస్ అకాడమీ దగ్గర బండి భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. అక్కడి నుంచి పేట్‌బషీరాబాద్ పిఎస్‌కు తరలించినట్లు చెప్పారు.

