తెలంగాణ కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ కోర్టులో కేసు: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో పెను సంచలనం సృష్టించిన మీనాక్షీ నటరాజన్ పాత కోర్టు కేసు వ్యవహారం మరో లీగల్ మలుపు తిరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాపై హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను విచారించే ప్రత్యేక పరిధి తమకు లేదని స్పష్టం చేసింది, ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు పిటిషనర్‌కు వాపస్ చేయడం లీగల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నారాయణపేట కాంగ్రెస నాయకుడిపై శ్రీలత ఫిర్యాదు
రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికం కాదు.. ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహం, ప్రతి కేసు వెనుక ఒక పొలిటికల్ లెక్క ఉంటుంది అనడానికి తెలంగాణ టు మధ్యప్రదేశ్ సరిహద్దులను దాటి సాగిన మీనాక్షీ నటరాజన్ ఉదంతమే తాజా నిదర్శనం. నారాయణపేటకు చెందిన ఒక స్థానిక కాంగ్రెస్ నాయకుడికి, శ్రీలత అనే మహిళకు మధ్య మొదలైన సాధారణ గొడవ పోలీస్ స్టేషన్ దాటి నాంపల్లి కోర్టు మెట్లెక్కింది. అయితే, సదరు యువతి తన పిటిషన్లో కేవలం స్థానిక నేతనే కాకుండా, ఏకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి అగ్రశ్రేణి నాయకత్వాన్ని దీపాదాస్ మున్షీ, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షీ నటరాజన్ నిందితులుగా చేరుతూ కోర్టును ఆశ్రయించడంతో ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. దీని ఆధారంగా కోర్టు సదరు నేతలకు నోటీసులు జారీ చేసింది.
ఈలపై స్పందించిన మీనాక్షీ నటరాజన్.. ఈ గొడవతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరును ఈ పిటిషన్ నుండి తొలగించాలని కోర్టుకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఇక్కడే అసలు న్యాయపరమైన చిక్కు వచ్చి పడింది. చట్ట ప్రకారం ఆమె లీగల్ గా స్పందించడంతో, కోర్టు ఆ ఆరోపణలను అధికారికంగా కాగ్నిజెన్స్‌లోకి తీసుకున్నారు. తన పేరును వివాదం నుంచి ముందే తొలగించుకుందామని ఆమె వేసిన అడుగే.. చివరకు చట్టంలోని లొసుగుల ద్వారా ఆమె మెడకు ఉచ్చుగా మారి, రాజకీయ వ్యూహకర్తల చేతికి ఒక బలమైన అస్త్రాన్ని అందించింది.
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు.!!!
కాబట్టి మీనాక్షి నటరాజన్‌కు ఈ విషయం గురించి ఎల్లప్పుడూ తెలుసు, కాబట్టి TPCC మహేష్ కుమార్ గౌడ్? అఫిడవిట్లో పేర్కొనలేదని బాధితురాలు చెప్పింది.
కోర్టుకు సమాధానాలు ఇవ్వడం అంటే ఏమిటి?
మహేశ్ కుమార్ గౌడ్ బాధితుడికి ఎందుకు సమాచారం అందించాడు &…
— నవీన (@TheNaveena) జూన్ 12, 2026
ఈ లీగల్ వెపన్‌ను ప్రత్యర్థులు సరిగ్గా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల సమయంలో ప్రయోగించారు. అక్కడ కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా మీనాక్షీ నటరాజన్ నామినేషన్ వేయగా.. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ వ్యూహాత్మకంగా మూడో అభ్యర్థిని బరిలోకి దించింది. సరిగ్గా స్క్రూటినీ సమయానికి నాంపల్లి కోర్టులో కాగ్నిజెన్స్ లో ఉన్న ఈ కేసు వివరాలను మీనాక్షి తన నామినేషన్ అఫిడవిట్లో దాచారనే సాంకేతిక కారణాన్ని తెరపైకి తెచ్చి, ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంలో బీజేపీ విజయం సాధించింది. ఎక్కడో తెలంగాణలో జరిగిన చిన్న స్థానిక గొడవను జాతీయ నేతలకు లంకె పెట్టడం, దానికి కోర్టు నోటీసులు ఇవ్వడం, చివరకు వేరే రాష్ట్రంలో రాజ్యసభ సీటును లాగేసుకోవడం వెనుక ఎంతటి వ్యూహం, మైండ్ గేమ్ దాగి ఉందో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
ఇప్పుడీ పిటిషన్ ను అసలు విచారణకు స్వీకరించకుండా కోర్టు రిటర్న్ చేసింది. శ్రీలత ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. అంటే.. ఇప్పటికిప్పుడు మీనాక్షి నటరాజన్‌పై అసలుకేసేలేదని అర్థమని.. కానీ ఆమె నష్టపోయారని కాంగ్రెస్ వర్గాలున్నాయి.
లీఫ్ హెల్మెట్ ధరించిన వ్యక్తి వైరల్ వీడియో | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!

