తెలంగాణ:ప్రభుత్వం మీసేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మార్చనుంది.మెటా (ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్) సహకారంతో ఈ నూతన సేవలు ప్రారంభం కానున్నాయి.
దీని ద్వారా చిన్న వ్యాపారాలు తక్కువ ఖర్చుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లలో డిజిటల్ ప్రకటనలు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీసేవ నిర్వాహకులకు అదనపు ఆదాయ అవకాశాలను కూడా అందిస్తుంది.
ఇది తెలంగాణలో డిజిటల్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించే ఒక వినూత్న ప్రయత్నం.

