మన తెలంగాణ/హైదరాబాద్: వర్షాకాలం ఆరంభంలో వరుణుడి భీభత్సానికి జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. విపరీతమైన వర్షానికి తోడు భారీ ఈదురు గాలులు వీయడంతో రోడ్లపై చెట్లు పడి ప లు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి బీర్సాయిపేట సమీపంలో రోడ్డుపై చెట్లు కూలడంతో వా హనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లా చేగుంట పాఠశాల వదర నీటిలో చె రువు తలపించింది. కొండాపూర్ మండల వ్యాప్తం గా భారీ వర్షం కురవడంతో చెట్ల కొమ్మలు విరిగిపోయి రోడ్డుపైనే పడిపోయాయి. ముసాయిపేట మండలంలో రైల్వే అండర్ పాస్‌లో నీరు నిలిచిపోవడంతో ఆ రహదారి గుండ రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరంగల్ జిల్లా దుగ్గొండిలో గాలి దుమారానికి అరటి పంటలకు అపార నష్టం వాటిల్లింది. వారి లక్ష్మీపురం గ్రామానికి చెందిన యుగంధర్, రాజేశ్వరరావు, సురేందర్‌లకు చెందిన 25 ఎకరాల అరటి చెట్లు నేలకొరిగాయి. భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి, గంటల తరబడి రోడ్లపైనే ట్రాఫిక్ స్తంభించి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ ఘాతానికి తండ్రి, కూతుళ్లు మృతి చెందడం తీవ్రంగా పలువురిని కలిచి వేసింది. మీర్‌పేటలో చెట్టు కూలిపోయిన మహిళా మృతి చెందింది. దీంతో గత 48 గంటల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి, తెగిపడిన విద్యుత్ తీగలకు నగరంలోనే ఐదుగురు బలయిపోవడం. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, ఫిలింనగర్, పంజాగుట్ట, కూకట్పల్లి, కెపిహెచ్బి, బాచుపల్లితో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శంషాబాద్‌లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లంతా నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
కారును కాపాడుకునే ప్రయత్నంలో
అల్వాల్ వెంకటాపురం డివిజన్ పరిధిలోని కారును కాపాడుకునే ప్రయత్నంలో తండ్రి, కూతుళ్లు విద్యుత్ ఘాతానికి మృతి చెందిన ఘటన స్థానికులను కలిచివేసింది. కళాశాలలో సిహెచ్ సందీప్ (44) బాలానగర్‌లోని ‘సాయిశ్రీ ఫుడ్స్’లో టెలివిజన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శ్వేత, కుమార్తె రితిక (16), కుమారుడు చరపాణి ఉన్నారు. కుమార్తె రితిక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2.-45 గంటల ప్రాంతంలో అల్వాల్‌లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి సందీప్ ఇంటిముందున్న ఒక పెద్ద చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఇంటిముందు పార్క్ చేసి ఉన్న తమ కారుపై పడిన చెట్ల కొమ్మలను పక్కకు జరిపేందుకు సందీప్, ఆయన భార్య శ్వేత, కుమార్తె రితికలు కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. చీకట్లో కారును తీసే ప్రయత్నంలో రోడ్డుపై వేలాడుతున్న ఒక విద్యుత్ తీగను శ్వేత గమనించారు. ఆ తీగను పక్కకు జరపబోగా ఆమెకు స్వల్పంగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆమె ఒక్కసారిగా వెనక్కితగ్గారు.
సరిగ్గా అదే సమయంలో చెట్టు కొమ్మల మధ్య నలిగిపోయి ఉన్న మరో లైవ్ విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగి కుమార్తె రితికపై పడింది. హై ఓల్టేజ్ విద్యుత్ ప్రసారంతో రితిక కేకలు వేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కళముందే కూతురు ప్రాణాపాయంలో ఉండటం చూసి తండ్రి సందీప్ తల్లడిల్లిపోయారు. ఎలాగైనా కుమార్తెను కాపాడుకోవాలనే ఆరాతో ఆయన ముందుకు పరుగెత్తి, ఆమెపై ఉన్న లైవ్ వైర్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. ఆ విద్యుత్ తీగ సందీప్‌ను కూడా బలంగా చుట్టుకోవడంతో ఆయనకూ తీవ్రమైన విద్యుదాఘాతం తగిలింది. ఈ ఘటనలో తండ్రీ, కూతురు అక్కడికక్కడే మరణించారు. ఈ లోగా స్వల్ప షాక్ నుంచి తేరుకున్న భార్య శ్వేత, భయాందోళనలతో సురక్షిత స్థితిలో చేరుకొని ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే 108 అత్యవసర అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన సందీప్, రితిక పరీక్షించిన సిబ్బంది, వారు ఇప్పటికే విద్యుదాఘాతంతో మరణించినట్లు ధృవీకరించారు. భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగిపడటం,
దానితో పాటు స్ట్రీట్ లైట్ తీగలు తెగిపోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ మార్చురీకి ప్రారంభించారు. ఒకే ఇంట్లో తండ్రీకూతుళ్లు మృతి చెందడంతో టెలికాం కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకోగా బంధుమిత్రులు, స్నేహితుల రోదనలు అందరి హృదయాలను కదిలించాయి. కాగా, మృతురాలు రితిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న కుమార్తె, కుటుంబానికి పెద్ద దిక్కైన భర్త ఒకే ప్రమాదంలో కళ్లముందే అనంత లోకాలకు వెళ్లిపోవడంతో శ్వేత రోదనలు స్థానికులను కన్నీటిపర్యంతం చేశాయి. ఇదిలా ఉండగా అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు అధికారులతో కలిసి సంఘటనా సంఘటనను సందర్శించారు.
ఈదురు గాలకు తాటిచెట్టు ఇంటిపై పడి వృద్ధురాలు మృతి
బలమైన ఈదురుగాలుల కారణంగా విరిగిన తాటి చెట్టు ఇంటిపై పడడంతో రేకులు విరిగిపడి వృద్ధురాలిపై పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చికిత్స పొందిన సంఘటన మీర్‌పేట పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో స్థానిక రాఘవేంద్ర కాలనీకి చెందిన సభావత్ రమేష్ ఇంటివెనుక వైపు ఉన్న తాటిచెట్టు బలమైన ఈదురుగాలుల కారణంగా విరిగి రమేష్ ఇంటిపై పడింది. దీంతో రేకులు విరిగి ఇంట్లోని రమేష్ తల్లి సభావత్ లక్ష్మీసేవ్య (75)పై పడడంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీసేవ్య అదే రోజు రాత్రి 11 గంటలకు అనారోగ్యం పాలైంది.
మరో మూడు రోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు
రాష్ట్రంలో శనివారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో 115.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది, వనపర్తి జిల్లా రేవళ్లలో 73.5, యాదాద్రి భువనగిరి జిల్లా వెర్కట్‌పల్లె 67.5, వికారాబాద్ జిల్లా పెద్దఉమ్మెంతలలో 64.5 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదివారం రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నాగర్ కర్నల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి, ఈ జిల్లాల్లో 40 నుంచి 50 గంటల వేగంతో ఈదురు గాలులు వీచే వాతావరణ కేంద్రం ఉంటుంది. దీనితో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

