- కృష్ణా, గోదావరి జలాల్లో హక్కుల కోసం ప్రశ్నిస్తే
- నన్ను తిడుతున్నరు: హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు: కర్ణాటకలో ముగ్గురు సీఎంలతో జరిపిన మీటింగ్‌పై రేవంత్ రెడ్డి నోరు విప్పాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆ మీటింగ్ ఏం మాట్లాడారు..? కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడతారా..? అని తాను ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా తనను తిడుతూ తప్పించుకుంటున్నారని. ఆదివారం సిద్దిపేటలో బీఎల్ఈఏల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన ఎత్తు గురించి మాట్లాడి సీఎం తప్పించుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
”నేను పొడుగుంటే ఏంది, జగదీశ్ రెడ్డి పొట్టిగుంటే.. ప్రజలకు సేవ చేయడంలో, అభివృద్ధి చేయడంలో ఎప్పుడూ పొడుగుగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి మనసు, ఆలోచన, నీ కురుచ బుద్ధి పొట్టింది.. కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. హామీల గురించి మాట్లాడటం చేతకాక బీఆర్ఎస్ ను తిడుతున్నారు. గుంపు మేస్త్రీ ముంపు మేస్త్రీగా మారొద్దు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను తిట్టకుండా ఉండలేకపోతున్నాడంటే మా పార్టీ బలం పుంజుకుంది. కుర్చీ కదులుతోందన్న భయం ఆయనలో పట్టుకుంది. మరో పదేండ్లు అధికారంలో ఉంటామంటున్న రేవంత్, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి. మీ పాలన మీద నమ్మకం ఉంటే ఎన్నికలకు పోదాం” అని సవాల్ విసిరారు.
రైతుల కన్నీళ్లు కనిపిస్తలేవా?
వడ్లు అమ్ముడుపోక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే, 80 లక్షల టన్నుల వడ్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. సింగరేణి టెండర్లే కాలేదని రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడకుండా, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చి, సీఎం బావమరిది సృజన్ రెడ్డికి టెండర్ కట్టబెట్టారని, అసెంబ్లీలో చర్చ పెడితే తాను రుజువు చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే లేదని ఎద్దేవా చేశారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “ముగ్గురు సీఎంల భేటీపై రేవంత్ నోరు విప్పాలి : హరీశ్ రావు”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

