న్యూఢిల్లీ: కేంద్ర విద్యామంత్రిత్వశాఖ వైద్య విద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలలో కీలక మార్పులకు రంగం సిద్ధం చేసింది. బోర్డు పరీక్షల ద్వారా 50 శాతం మార్కుల వెయిటేజ్ పరీక్ష తీవ్రంగా కనిపిస్తోంది. వృత్తి విద్య కోర్సుల ప్రవేశ పరీక్షలలో ఉత్పన్నమవుతున్న సమస్యలను తెలుసుకోవడానికి కేంద్ర విద్యామంత్రిత్వశాఖ తొమ్మండుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని గత ఏడా ది ఏర్పాటు చేసింది. ఇప్పుడు కీలక కోర్సుల్లో ప్రవేశాలకు నీట్, జెఇ వంటి పరీక్షల మార్కులను ప్రాతిపదికగా చేసుకుంటున్నారు. బోర్డు సిలబస్‌లకు అనుగుణంగా ప్రవేశపరీక్షలను మార్చాల్సి ఉంది. పైగా ఇప్పుడు నీట్, జెఇ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు కోచిం గ్ సెంటర్లు, విద్యార్థులకు విద్యాభ్యాసం వైపు మరో పోటీ పరీక్షలకు కూడా ఏకకాలంలో సిద్ధం కావడం, ఈ మానసిక ఒత్తిళ్లకు గురికావడం వంటి అంశాల గురించి విద్యా మంత్రిత్వశాఖకు మానసిక నిపుణుల నుంచి కీలక సూచనలు అందాయి.
ఇటీవలి కాలంలో కోచింగ్ సెంటర్లు కేంద్రాలుగా చేసుకుని ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏర్పాటు అయిన ఉన్నత స్థాయి కమిటీ సరైన ప్రతిపాదనల నివేదికను త్వరలో కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. విద్యాభ్యాసంలో ప్రత్యేకించి బోర్డు ద్వారా జరిగే విద్యాభ్యాసం ప్రాతిపదికన కీలక ప్రవేశపరీక్షలకు ప్రవేశాలను కల్పించడం జరిగితే పోటీ పరీక్షల ముందస్తు గందరగోళం జరగదని, సున్నితమనస్కులైన కొందరు విద్యార్థుల బలవన్మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని కమిటీ సభ్యులైన విద్యా నిపుణులు సూచిస్తున్నారు. బోర్డు మార్కుల వెయిటేజ్ కల్పిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలుస్తుంది.
ప్రత్యేకించి ఇప్పుడున్న పరీక్షల వ్యవస్థలోని పలు లోపాలతో , మార్కుల మూల్యాంకనాలలో గందరగోళం, పేపర్ లీక్‌లతో ఈ వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు అవసరం అనే డిమాండ్ వచ్చింది. ఇప్పుడున్న ప్రవేశాల విధానంలో మెడికల్ లేదా ఇంజనీరింగ్ సీట్లు సంపాదించాలంటే ఎంట్రన్స్ పరీక్షలలో సాధించిన మార్కుల ప్రాతిపదిక కీలకం అయింది. ఇదే దశలో బోర్డు పరీక్షల ద్వారా ఎంట్రెన్స్ పరీక్షలకు అర్హత దక్కించుకోవల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఇప్పుడు కుటుంబాలు తమ పిల్లల ఉన్నత కోర్సుల చదువుల కోసం పోటాపోటీ తత్వపు కోచింగ్ సెంటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక్కడి అదనపు చదువుతోనే పోటీ పరీక్షల్లో నెట్టుకురావచ్చుననే ఓ వలయం ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు పరీక్షల కీలక సంస్కరణలు అనివార్యం అని నిర్ణయించారు. అయిన ఏర్పాటు తుది నివేదిక వచ్చే కొద్ది వారాలలో అందితే సరైన దిశలో చర్యలు ఉంటాయని వెల్లడైంది. అన్నింటికీ మించి ప్రవేశపరీక్షలకు స్కూల్ సిలబస్‌కు మరింత అనుసంధానం అవసరం అని కూడా ప్యానల్ స్పష్టం చేసినట్లు వెల్లడైంది.

