తెలంగాణ:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లిలోని మేడిగడ్డ ( మేడిగడ్డ )(లక్ష్మీ) బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.బ్యారేజ్‌కు 90,580 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా,అధికారులు అప్రమత్తమయ్యారు.
వరద నీటిని దిగువకు సురక్షితంగా విడుదల చేయడానికి బ్యారేజ్‌లోని మొత్తం 85 గేట్లను ఎత్తివేసేందుకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహాన్ని అధికారులు పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్న వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరివాహక ప్రాంతాలకు అనవసరంగా వెళ్లాలని సూచించారు.

