Published on: 5:25 pm, 23 జూలై 2026
ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే కాక్రోచ్లు లేవని, ఆంధ్రప్రదేశ్‌లో తాము కూడా కాక్రోచ్‌లమే అని స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ మాట అందరికీ గుర్తుండే ఉంటుంది. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు మరియు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎత్తిచూపుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి వాటిని ఒప్పుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు.ఇప్పుడు రాజధానిలో ఆ కాక్రోచ్ లే గొంతెత్తుతున్నాయి.. కానీ ఎందుకో జగన్ మౌనంగా ఉండిపోయారు.
డీఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. కేసు కోర్టు మెట్లు కూడా ఎక్కుతోంది. డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు సుమారు 3.35 లక్షల మంది. నీట్‌కు దరఖాస్తు చేసిన వారు 22 లక్షల మందికిపైగా. డీఎస్సీ ప్రభావం ఒక రాష్ట్రానికే పరిమితం. లక్షలాది కుటుంబాలపై నీట్ ప్రభావం ఉంటుంది. మరి అలాంటి పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం స్వయంగా రీ-ఎగ్జామ్ నిర్వహించే స్థితి వచ్చినప్పుడు అదే స్థాయిలో వైసీపీలో ఆందోళన ఎందుకు కనిపించలేదు?
ఢిల్లీలో గత 25 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీల నేతలు కూడా వ్యవహరిస్తున్నారు. కానీ ఏపీలో నేతలు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. వారికి లాభం చేకూర్చే ఒక రకమైన స్పందన, రాజకీయ ప్రయోజనం కనిపించని మరో రకమైన స్పందన. ఈ ధోరణే ప్రజల్లో వైసీపీపై రాజకీయ అనుమానాలను పెంచుతోంది.

