ఉప్పల్ స్టేడియంలో SRH, RCB జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్ అయిపోగానే వెళ్లిపోకూడదని అభిమానులను SRH రిక్వెస్ట్ చేసింది. హోం గ్రౌండ్లో SRH టీంకు ఈ సీజన్లో ఇదే చివరి మ్యాచ్. అందుకే అభిమానులను పలకరించేందుకు SRH బృందంతో పాటు స్టాఫ్, కోచ్, ఇతర సిబ్బంది స్టేడియం మొత్తం చుట్టు వస్తారు.
ఇది మీ కోసం, ఆరెంజ్ ఆర్మీ 🧡 pic.twitter.com/400pq7PVYJ
— సన్‌రైజర్స్ హైదరాబాద్ (@SunRisers) మే 22, 2026
ఫలితం ఎలా ఉన్నా.. ఇంతగా తమను ప్రోత్సహిస్తున్న అభిమానులను ఇలా పలకరించడం అభిమానులకు ఇచ్చే గౌరవం. ఈ అరుదైన క్షణాలను మిస్ చేసుకోవద్దని SRH కోరింది. SRH గెలిచినా.. గెలవకపోయినా ఈ ‘ల్యాప్ ఆఫ్ హానర్’తో స్టేడియానికి వచ్చిన SRH అభిమానులు తమ అభిమానాన్ని అందరినీ దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా.. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉప్పల్ రింగ్ రోడ్లో ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగడం తాజా మ్యాచ్ రోజున మరింత రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత వాహనాల బదులు ఆర్టీసీ, మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని పోలీసులు సూచించారు.
ట్రాఫిక్ డైవర్షన్ రూట్లు..
ఘట్హే కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వెహికల్స్ ను మెహిఫిల్ హోటల్ పక్కనుంచి ఉప్పల్ భగాయత్ (హెచ్హెచ్ఈ ఎండీఏ లేఅవుట్) వైపు మళ్లిస్తారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్, ఘట్ కేసర్, తార్నాక వైపు వెళ్లే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుని ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా ఉపయోగించాలి.
తార్నాక వెళ్లేవారు చెంగిచర్ల–ఐవోసీఎల్–చర్లపల్లి మార్గంలో వెళ్లాలి. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు హబ్సిగూడ ఎక్స్ రోడ్, నాచారం, ఎన్ఎఫ్ఎఫ్సీ రోటరీ, ఐవోసీఎల్, చెంగిచర్ల, మేడిపల్లి మార్గంలో ప్రయాణించాలి.
ఇది కూడా చదవండి:కేకేఆర్‌కు బిగ్ షాక్.. డూ ఆర్ డై మ్యాచ్ వేళ స్టార్ ప్లేయర్ ఔట్
వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే హెవీ వెహికల్స్ ఘాట్ కేసర్ వద్ద ఓఆర్ ఆర్ ద్వారా అబ్దుల్లాపూర్ మెట్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీనగర్ మార్గంలో వెళ్లాలి. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్, హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మీదుగా ఓఆర్ ఆర్ చేరుకుని ఘట్ కేసర్ వెళ్లాలి. మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
ఐదు ప్రాంతాల పార్కింగ్..
మ్యాచ్‌కి వచ్చే ప్రేక్షకుల వాహనాల కోసం ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ, వీఐపీ, పాస్ హోల్డర్లకు స్టేడియం లోపలే పార్కింగ్ కల్పించారు. ఎల్బీనగర్–రామంతాపూర్ వైపు నుంచి వచ్చే ప్రేక్షకులకు డీఎస్ ఎల్ ఓపెన్ ప్లేస్, మోడరన్ బేకరీ, ఎల్జీ గోడౌన్ జంక్షన్ నుంచి కేమ్ వేదా జంక్షన్ వరకు పార్కింగ్ చేశారు.
తార్నాక–హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వారికి సర్వే ఆఫ్ ఇండియా వద్ద యూటర్న్ తీసుకుని ఏక్ మినార్, పెంగ్విన్, టీజీ ఐలా వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలను వినియోగించాలని పోలీసులు తెలిపారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “మ్యాచ్ అయిపోగానే వెళ్లిపోకండి.. ఫ్యాన్స్‌కు SRH రిక్వెస్ట్.. ఆగమన్నది ఇందుకే !”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

