నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. నేటితో ప్రధానిగా మోదీకి 12 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
పలు కీలక నిర్ణయాలు…
కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని మోదీకి కేబినెట్లో ఉన్న సహచర మంత్రుల అభినందనలు తెలపనున్నారు. దీనితో పాటు పన్నెండేళ్ల పాలనకు సంబంధించిన విషయాలను చర్చించడమే కాకుండా, తాజా రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశముంది.

