రాను ముంబై కి రాను సాంగ్ ఫేమ్ లిఖిత తెలుగు డెబ్యూ మూవీ లాంచ్: ‘రాను ముంబయికి రాను’ ఫోక్ సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క పాటతోనే రాము రాథోడ్, లిఖిత సూపర్ ఫేమస్ అయిపోయారు. అక్కడి నుంచి వరుసగా టాలీవుడ్ ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఆడియన్స్‌కి దగ్గరయ్యారు లిఖిత. ఇప్పుడు ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు.
టైటిల్ ‘సావీ3’
ఈ మూవీలో బిగ్ బాస్ 9 ఫేం డీమోన్ పవన్, సామ్రాట్ హీరోలుగా నటిస్తుండగా… ‘సావీ3’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. నటుడు, దర్శకుడు కృష్ణమాయ లిఖితను టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా… వి.విజయ నిలబడ్డారు. ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
అందుకే గ్యాప్ ఇచ్చా
హీరోయిన్గా మంచి రోల్స్ చేయాలనే ఫోక్ సాంగ్స్‌కు గ్యాప్ ఇచ్చినట్లు చెప్పారు లిఖిత. ‘డైరెక్టర్ స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే మూవీ ఎలా క్లియర్‌గా ఉంటుందో తెలిసింది. నేను బెస్ట్ స్క్రిప్ట్ కోసం తగిన టైమ్‌లో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. సామ్రాట్, పవన్ లాంటి స్టార్స్ దొరకడం హ్యాపీగా ఉంది. వాళ్లు తమ పెర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. ఎలాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా మేమంతా కథను ఓన్ చేసుకుని నటించాం. అదంతా మా డైరెక్టర్ వల్లే సాధ్యమైంది.’ అని అన్నారు.
Also Read : OTT సినిమాలు : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ – రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ…
బిగ్ బాస్ తర్వాత తాను ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్‌లో డైరెక్టర్ కృష్ణమాయ ఈ స్క్రిప్ట్ చెప్పారని హీరో డీమోన్ పవన్ చెప్పారు. ‘ఇలాంటి దర్శకుడితో వర్క్ చేస్తే నటుడిగా నాకు మంచి పేరొస్తుందని నమ్మాను. మేమంతా ఈ సినిమా కోసం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ నేచురల్‌గా నటించాం. సామ్రాట్ గారి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే లిఖితకు హీరోయిన్గా మంచి పేరు వస్తుంది. తక్కువ టైం లో మేమంతా క్వాలిటీగా సినిమా చేశాం.’ అని తెలిపారు.
ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అని మరో హీరో సామ్రాట్ అన్నారు. ‘రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని చేస్తున్న చిత్రమిది. షూటింగ్ కంప్లీట్ చేశా. చాలా ప్లాన్డ్గా, ఫాస్ట్‌గా షూటింగ్ పూర్తి చేశాం. లిఖిత ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుంది. నేను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సమ్ థింగ్ సమ్ థింగ్ అనే మూవీ చేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటి మంచి క్యారెక్టర్ నాకు దొరికింది. ఒక కొత్త సామ్రాట్‌ను ప్రేక్షకులు చూస్తారు.’ అని చెప్పారు.
‘సావీ3’ నటినటులు & టెక్నికల్ టీం – డీమోన్ పవన్, లిఖిత, చేపట్టారు. స్టంట్స్ – అఖిల్, ఎడిటర్ – శివ శర్వాణి, DOP – పవన్ మణి
మ్యూజిక్ డైరెక్టర్ – సాయి కార్తీక్, ప్రొడ్యూసర్ – వి. విజయ, ఆర్ట్ డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – కృష్ణ మాయ.
ఇది కూడా చదవండి : లోకేష్ కనగరాజ్ యూనివర్స్ : లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రవి మోహన్ – కాంట్రవర్సీస్ తర్వాత ఫస్ట్ టైం
గమనిక : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్లు, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకా చదవండి

