భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ధార్మిక అడ్వైజర్ గోవింద్ హరీ కన్వీనర్‌గా నియామకం కాగా భద్రాచలం ఈవో దామోదర్‌రావు, భద్రాద్రి కొత్తగూడెం ఆర్అండ్బీఎస్ఈ లాల్‌సింగ్, దేవస్థాన ఈఈ రవీందర్‌రాజు, స్థపతి వల్లీనాయకన్, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవమూర్తి, స్థానాచార్యులు నారాయణ స్థలానికి చెందిన సూర్య, ఆర్కిటెక్చర్ల సాయి, ఆర్కిటెక్చర్లు రూ.351 కోట్లతో ప్రారంభమైన అభివృద్ధి పనులను ఈ కమిటీ నిర్వహించనుంది.

