లక్నో: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఏకనా స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆఫ్గానిస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వేదికలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌ను గెలిచి సిరిస్ సొంతం చేసుకోవాలని భారత్ అనుకుంటుంది. మరో వైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆఫ్గాన్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులు చేసింది. జైస్వాల్, కుల్దీప్లు జట్టులోకి వచ్చారు. ఇక ప్రిన్స్ ఈ మ్యాచ్‌తో ఆరంగేత్రం చేస్తున్నాడు. అఫ్గానిస్థాన్ కూడా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది.

