కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు అండగా ఉన్నామంటూ కిషన్ రెడ్డి చెబుతున్న మాటలు పూర్తిగా అర్థరహితమన్నారు. తెలంగాణ రైతులపై బీజేపీదంతా కపట ప్రేమేనంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ నాయకులు ఎన్నోమార్లు ప్రశ్నించినా… కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామగుండం ఆర్ఎఫ్సీఎల్ (RFCL) పరిశ్రమపై కూడా ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ కాకా వెంకటస్వామి పదివేల కోట్ల రుణమాఫీ చేయించి ఆర్ఎఫ్సీఎల్ సంస్థను పునరుద్ధరిస్తే… నేటి బీజేపీ ప్రభుత్వం తన చేతగాని తనంతో ఆ సంస్థను నిర్లక్ష్యం చేస్తోందని. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణంగానే తెలంగాణ రైతులకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక అయోధ్య రామమందిరం చూసి ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు ఎంపీ వంశీకృష్ణ. ఎన్నికల్లో రాముడి పేరు చెప్పి ఓట్లు వేసిన బీజేపీ… ఇప్పుడు అదే రామమందిరం నిర్మాణం పేరుతో ఏకంగా 250 కోట్ల రూపాయల స్కామ్‌కు దొంగిలించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

