గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (96), జోష్ ఇంగ్లిష్ (60) పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 19 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయిన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు యశస్వి (43), వైభవ్ సూర్యవంశీ (93) శుభారంభం అందించారు. ధ్రువ్ జురెల్ 56 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.

