తెలంగాణ:వరంగల్లోని భద్రకాళి ఆలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వ భూముల వేలంలో ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుండగా,ఈ ఆరోపణలపై భద్రకాళి ఆలయంలో ప్రమాణం చేయించారు ప్రస్తుత కుడా (KUDA) చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు.ఈ నేపథ్యంలో (KUDA మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి ),ఇతర బీఆర్ఎస్ నాయకులు తడిబట్టలతో భద్రకాళి ఆలయానికి చేరుకుని ప్రమాణం చేసేందుకు ప్రయత్నించారు.
అయితే,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు వారిని ఆలయం వద్దే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం మర్రి యాదవరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనతో భద్రకాళి ఆలయ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.శాంతిభద్రతల దృష్ట్యా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

