తెలంగాణ:సంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది సంగమేశ్వర- బసవేశ్వర ప్రాజెక్టును (సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్ట్ )కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు (ఎమ్మెల్యే హరీష్ రావు )ఆరోపించారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులకు వెంటనే నిధులు మంజూరు చేసి, యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయించేందుకు ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హరీష్ రావు ప్రకటించారు.అవసరమైతే సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కూడా నిర్వహించామని తెలిపారు.
సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని నిర్ణయించింది.

