తెలంగాణ సీఎం సభల విషయంలో ఇక నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయా? నో జంబోస్…. ఓన్లీ కాంబోస్ అని సెక్యూరిటీ వింగ్ ఏంటోందా? ప్రోటోకాల్, వీఐపీ పాస్‌ల విషయంలో కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయా? అసలేంటా ఛేంజెస్? రెండున్నరేళ్ళ తర్వాత సడన్‌గా ఇప్పుడెందుకు మార్పులు చేస్తున్నారు? . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్లొనే సభావేదికల విషయంలో…కీలకమైన మార్పులు చేయాలని కోరుకుంటున్నారట. సీఎం సెక్యూరిటీ వింగ్ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మీదట ప్రోటోకాల్ ఉన్న వారు మాత్రమే వేదిక మీద కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు. ఇప్పటి వరకు కొనసాగుతున్న జంబో సిస్టంను పూర్తిగా మార్చివేయబోతున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు ప్రభుత్వం, పార్టీ తరుపున సభలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కంటే….. సీఎం కూర్చునే సభా వేదికపై ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తున్నారు.
కానీ… అదే ఇప్పుడు సీఎం సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారడంతో పాటు ప్రోటోకాల్ వివాదం తలెత్తుతున్నట్లు కనిపిస్తోంది. నేతల అత్యుత్సాహంతో కొందరు సెక్యూరిటీ అధికారులు బాగా ఇబ్బంది పడుతున్నారట. భద్రతా పరంగా వరుస వివాదాలు జరుగుతున్నట్టు గుర్తించినట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో సీఎం కూర్చునే వేదిక మీద… నిర్దేశించిన కొందరు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇతర ముఖ్య నేతలకు వేదిక ఎదురుగా ప్రత్యేకంగా వీవీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేసేవారు. దాంతో… ప్రజాప్రతినిధులు అందరికీ సరైన ప్రాధాన్యత దక్కడంలేదనే విమర్శలు అప్పట్లో ఉండేవి. తమ ప్రభుత్వంలో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదనుకున్న సీఎం రేవంత్ రెడ్డి… తాను పాల్గొనే సభల్లో వేదికల మీద అధికారులతోపాటు ప్రజాప్రతినిధులకు, స్థానిక నేతలకు కూడా అవకాశం ఇవ్వలేదు. దానితో… వేదికపై కూర్చునే వారి సంఖ్య పెరిగి జంబో అయింది. సీఎంతో సహా… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఒకే రకమైన కుర్చీలు వేయడం, మిగిలిన ప్రజాప్రతినిధులకు కూడా సెక్యూరిటీ అభ్యంతరాలు లేకుండా వేదిక మీద కూర్చునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే… ఈ కొందరు నేతలు దుర్వినియోగం చేస్తున్నట్టు తాజాగా బయటపడుతోంది. వేదిక మీదున్న వాళ్ళు అత్యుత్సాహంతో సెక్యూరిటీని దాటుకొని సీఎంను కలవడానికి దూసుకు రావడం, శాలువాలు కప్పడం, వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు ఆయన వేదిక ఎక్కే, దిగే సమయంలో సెక్యూరిటీ సూచనలు పట్టించుకోకుండా అధికారులు గమనించారు. ఇలాంటివన్నీ బాగున్నంతవరకు బాగానే కనిపిస్తున్నానీ…. రేపు ఏదైనా చిన్న తేడా జరిగితే ఏంటన్నది భద్రతా అధికారుల ప్రశ్న. అందుకే కంట్రోల్ పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం.
వేదికపై కూర్చునే నేతల జాబితా తయారీలోనూ, పాస్‌ల జారీ విషయంలోనూ సీయం సభ జరిగే ప్రాంతంలో స్థానిక నేతల అతి జోక్యం… సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఇందుకు గత ఆదివారం నల్లగొండలో సీఎం సభ ముగిశాక వేదికపై చోటుచేసుకున్న ఘర్షణనే ఉదాహరణగా చూపిస్తున్నారు. వేదిక మీద ఘర్షణ, ముఖ్యమంత్రి కాన్వాయ్ అడ్డగింతను సెక్యూరిటీ ఆఫీసర్స్ సీరియస్‌గా తీసుకున్నారు. ఘర్షణకు గురైన వారిని గుర్తించిన పోలీసులు వారి చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మెల్లిగా ఎన్నికల వేడి కూడా రాజుకుంటున్నట్లు… ఇక నుంచి సీఎం భద్రత విషయంలో కఠినంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సెక్యూరిటీ విన్. లేని వేదిక మీదికి రాకుండా కఠినంగా వ్యవహరించాలని, ప్రోటోకాల్‌ను పక్కగా పాటించాలని అధికారులకు అనుమతి సూచనలు జారీచేసినట్టు సమాచారం. వేదిక మీద కూర్చునే వారి సంఖ్య కూడా పరిస్థితినిబట్టి పూర్తిగా కుదించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు చూపుతున్నాయి.

