మన తెలంగాణ/హైదరాబాద్: పన్నుల వసూళ్లకు, నిధుల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శా ఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గ్రామ పంచాయతీల పనితీరును కేవలం ప న్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా, ప్రజలకు అందించే సేవలు, పారిశుధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వం టి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడానికి విజ్ఞప్తి చేశారు. నిధుల కేటాయింపులో భాగంగా 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, సొంత రెవిన్యూ సమీకరణ వంటి నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, షెడ్యూల్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని నిర్దేశించారు. ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజాన్ సింగ్ అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై రాష్ట్ర పంచాయతీ శాఖ మం త్రులకు శుక్రవారం వర్క్‌షాప్ జరిగింది. తెలంగాణ ప్రతినిధి మంత్రి సీతక్క, పి ఆర్, ఆర్డి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ మద్దతు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు పనితీరు ఆధారిత గ్రాంట్లను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని,
అయితే ఆదాయ సామర్థ్యం తక్కువగా ఉన్న ఆదివాసీ, గిరిజన, మూల ప్రాంతాల గ్రామ పంచాయతీలపై అదనపు పన్నుల భారం మోపే విధంగా నిబంధనలు ఉండకూడదని సూచించారు. అభివృద్ధిని ప్రజల ఆర్థిక స్థితితో ముడిపెట్టడం సమంజసం కాదని వివరించారు. షెడ్యూల్ ప్రాంతాలు అనేక గ్రామ పంచాయతీల జనాభా చాలా తక్కువగా ఉండటంతో వాటి సొంత ఆదాయ వనరులు కూడా పరిమితంగానే ఉంటాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక సడలింపులు అందుబాటులో ఉన్నాయి, షెడ్యూల్ సంస్థ ఆదివాసీ, గిరిజన, కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మండల స్థాయి స్థానికులకు కూడా పనితీరు గ్రాంట్ల అర్హతలో వెసులుబాటు కల్పించాలని. బలమైన గ్రామ పంచాయతీలు, బలమైన రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణ పునాది వేయాలని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలంటే రాష్ట్రాలకు తగిన ఆర్థిక సామర్థ్యం ఉండాలని, సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేస్తూనే పంచాయతీలను మరింత శక్తివంతం చేసే విధంగా 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉండాలని మంత్రి సీతక్క సూచించారు.
ఎన్నికలు జరగని 62 గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి
తెలంగాణలో న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా ఎన్నికలు జరగని 62 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు నిలిపివేయడం వల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతుందని మంత్రి సీతక్క కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. కోర్టు కారణంగా ఎన్నికలు ఆలస్యమైన ప్రత్యేక పరిస్థితుల్లో నిధులు కొనసాగేలా నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామం అవసరం ఉండటంతో, అందువల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు తీసుకునేలా ఎంపిక చేసుకోవాలి. డిజిటల్ గవర్నెన్స్, ఈ- గ్రామ్ స్వరాజ్, పీఎఫ్ఎంఎస్ వంటి వ్యవస్థలను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని,
అమలుకు అవసరమైన శిక్షణ, సిబ్బంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సాంకేతిక మౌలిక సదుపాయాలను మారుమూల గ్రామాల్లో కేంద్రం వాటిని మెరుగుపరుస్తుంది. షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలు, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో ప్రజా సేవలను అందజేయడానికి అధిక వ్యయం అవుతున్నందున నిధుల కేటాయింపులో అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వబడుతుంది. బలమైన గ్రామ పంచాయతీలు, బలమైన రాష్ట్రాలు కలిసి బలమైన భారత నిర్మాణ పునాది వేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

