– ప్రకటన –
వర్షానికి కూలిన పాఠశాల గదుల దుస్థితి
నవతెలంగాణ-అచ్చంపేట
అచ్చంపేట మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో వరసగా కురుస్తున్న వర్షాలకు తరగతి గదుల గోడలు కూలిపోయాయి. పాఠశాల గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం అయ్యాయి. ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు ఉన్నప్పటికీ గదులు మాత్రం రెండే ఉన్నాయి. ప్రమాదపు అంచులలో విద్యార్థులకు బోధన చేయవలసిన పరిస్థితి. భోజన గది కూడా పూర్తిగా కూలిపోవడంతో మధ్యాహ్నం భోజనం చేయలేని పరిస్థితి. పాఠశాల (స్లాబ్) చెత్త కూడా పెచ్చులు ఊడి పడుతోంది.
పిల్లలకు రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై పాఠశాల హెడ్ మాస్టర్ స్వప్న వివరిస్తూ.. ఇటీవల కురిసిన వర్షానికి తరగతి గదులు కూలిపోయాయి. వంటగది కూడా కూలిపోవడంతో పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం చేయడం కష్టంగా ఉందని చెప్పారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా సురక్షితమైన వాతావరణ తరగతి గదులు ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, పాలకులను కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల వివరాలను పరిశీలించి మరమ్మతులు చేయవలసిన బాధ్యత అధికారులపై పాలకులపై ఎంతైనా ఉంది.
– ప్రకటన –

