విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 640 కోట్ల బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, ఉన్నత చదువుకు శాతంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకుడు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో సి ఆర్ భవనం నుండి కలెక్టరేట్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శి డి.సోమన్న, యస్ షాబీర్ భాషల మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విడుదల చేసిన విద్యార్థులకు అవార్డులు అందజేస్తున్న విద్యార్థులు ఐఎ్సఎ్సఎఫ్ అవార్డులను అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేశారు. కాలయాపన చేస్త పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తుంటే ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడం దురదృష్టకరం. విద్యార్థుల చదువులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారి భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. యువత పాదయాత్రలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వందరోజుల్లో జీవో నెంబర్ 77 రద్దు హామీ ఇచ్చి నేటికి ఈ అంశం పైన విద్యాశాఖ మంత్రి ఏ మాత్రం మాట్లాడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6400కు పైగా విడుదల చేయాలని ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న కుమారికి వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ రంగస్వామి, శరత్ కుమార్, దస్తగిరి, నగర అధ్యక్షులు కార్యదర్శి అభిరామ్, అశోక్, శేఖర్, అల్తాఫ్, శ్రీకాంత్, హాజీ, సుధాకర్, అఖిల్, ఉమామహేశ్వరి, రాజేశ్వరి, భార్గవి, వీరేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

