ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బాబాయిని జగన్ మోహన్ రెడ్డే చంపించాడు అంటూ లోకేశ్ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వివేకా హత్య కేసులో జగన్ పాత్రపై పలుమార్లు పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసిన లోకేశ్ తొలిసారిగా నేరుగా వివేకాను జగన్ చంపించాడు అంటూ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. కడపలో తాను పాదయాత్ర చేస్తున్నప్పుడే తాను ఈ విషయం చెప్పానని లోకేశ్ అన్నారు.
సొంత బాబాయ్ ను జగన్ లేపేశాడని, అయినా తప్పు కాదని అంటున్నాడని లోకేశ్ వ్యాఖ్యాచించారు. సింగయ్యను ఆయనే చంపేసినా తప్పుకాదని, వాళ్ల పార్టీకి చెందినవాళ్లు ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే తప్పు కాదని జగన్ అంటున్నాడు లోకేశ్.
అలాంటి వ్యక్తులు సమాజంలో మనం ఎక్కడికి పోతున్నాం అని ఆయన ప్రశ్నించారు. జగన్ కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందని, ఒక్కోరోజు ఒక్కో ఆత్మతో మాట్లాడుతారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒకరోజు మావిగన్ అంటాడని, మరో రోజు బెంటాహై..బెంగుళూరు, తాడేపల్లి, హైదరాబాద్…ఇలా వారంలో మూడు చోట్ల కవర్ చేస్తున్నాడు కాబట్టి అలా పిలిచానని చురకలంటించారు.
ఇలా రోజుకో రాజధాని అని చెబుతూ, గత హయాంలో పరిశ్రమలు రాకుండా జఫ్యా బ్యాచ్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నేతలను ఉద్దేశించి లోకేశ్ సందర్బంగా చెప్పారు. లేదంటే ఏపీకి వచ్చే పెట్టుబడిదారులు కూడా రేపు రారని చెప్పారు. అందువల్ల ప్రజలు, నిరుద్యోగ యువత ఇబ్బంది పడతారని అన్నారు.
కడపలోని మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. దానితోపాటు కొండాపురం మండలంలో రూ.3,000 కోట్ల పెట్టుబడితో నిర్మించిన 600 మెగావాట్ల ఎస్ఏఈఎల్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను లోకేశ్ గుర్తించారు. ఆ సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

