తెలంగాణ: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని దండ మండలం గుండాలవెల్ సమీపంలో గల ఏకలవ్య గురుకుల పాఠశాల వద్ద మిషన్ భగీరథ నీరు గత రెండు నెలలుగా వృధాగా పోతోంది.అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెల్దండ నుంచి సిరసనగండ్ల వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జరుగుతున్న సమయంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోవడం స్థానికులు తెలిపారు.
దీనితో పాటు త్రాగునీరు కూడా నెలలు తరబడి ఉండటంతో నాచు పేరుకొని కలుషితంగా ఉందని,ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

