– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజుల తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం భారతదేశానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సహా ఇతర నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈమె పర్యటన జూన్ 3- 7 వరకు కొనసాగుతుందని మంత్రిత్వశాఖ ప్రకటన.
కాగా, వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్, ప్రధాని మోడీలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ప్రధానంగా భారత్- వెనిజుల మధ్య సంబంధాలను సమీక్షించుకోనున్నారు. అలాగే ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, మందులు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని భారత విదేశాంగ ప్రకటన తెలియజేస్తోంది.
డెల్సీ రోడ్రిగ్జ్ భారత్ పర్యటన ఇది ఆరవ సారి. విదేశాంగ మంత్రిగా 2015లో, ఉపాధ్యక్ష పదవి హోదాలో 2019, 2023, 2024, 2025లో ఉన్నారు. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలు హోదాలో ఆరవ సారి భారత్‌కు అవసరమవుతుంది.
– ప్రకటన –

