భారత్ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం టి20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అది చాలా రోజులపాటు కొనసాగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, రాష్ట్రాల వంటి జట్లు భారత్ ఆధిపత్యాన్ని అడ్డుకోలేకపోయాయి.
కాలం మారింది. టీమ్ ఇండియా 2023 వన్ వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు వెళ్ళింది ట్రోఫీ అందుకోలేకపోయింది. 2024, 2026లో జరిగిన టి20 వరల్డ్ కప్ లు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. 202లో జరిగిన టి20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ట్రోఫీని దక్కించుకుంది.
వేదికలపరంగా, టి20 లపరంగా టీమ్ ఇండియాకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు టీమ్ ఇండియా అత్యంత బలంగా ఉంది. యంగ్ ప్లేయర్లు వైట్ బాల్ ఫార్మాట్లో అదరగొడుతున్నారు. వరద పారిస్తున్నారు. ఐపీఎల్లో సత్తా చూపించిన ప్లేయర్లకు మేనేజ్మెంట్ అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో వారు వాటిని అందజేస్తున్నారు. అంతేకాదు అద్భుతమైన ఆట తీరితో అదరగొడుతున్నారు.
వైట్ బాల్ రూపంలో సరిగ్గా దుమ్ము రేపుతున్న నేపథ్యంలో టాప్ ర్యాంకును సుస్థిరం చేసుకుంటున్నది. పైగా ఈ ఫార్మాట్లలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటూ అదరగొడుతోంది. న్యూజిలాండ్ వల్ల కానిది.. ఆస్ట్రేలియా చేయలేనిది.. దక్షిణాఫ్రికా కలలో కూడా ఊహించలేనిది.. భారత్ చేసి చూపిస్తోంది. ఇంతవరకు బాగానే రెడ్ బాల్ విషయంలోనే భారత్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది.
టెస్ట్ విషయానికి వచ్చేసరికి ప్లేయర్లు తడబడుతున్నారు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోతున్నారు. రోజుల తరబడి క్రికెట్ ఆడలేక పోతున్నారు. ప్రస్తుతం రెడ్ బాల్ ఫార్మాట్ లో మూడో స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో రెండుసార్లు టీం ఇండియా ఫైనల్స్ వెళ్ళింది. రెండుసార్లు కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. ఒకసారి న్యూజిలాండ్, మరొకసారి ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైంది. గత సీజన్లో కనీసం ఫైనల్ కూడా వెళ్లలేకపోయింది.
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో.. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది. అంతకుముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి పాలైంది. ఇవన్నీ కూడా టెస్ట్ భవితవ్యాన్ని సూచిస్తాయి. అంతేకాదు డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో ఆరవ స్థానంలో కొనసాగుతూంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి బంగ్లాదేశ్ కూడా మనకంటే పై స్థానంలో ఉంది. శ్రీలంక కూడా అప్పర్ హ్యాండ్లో కొనసాగుతోంది. వీనిటన్నిటికీ చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా ప్లేయర్లు సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడాలి. టి20 ఫార్మాట్ నుంచి బయటికి రావాలి.. డిఫెన్స్ బ్యాటింగ్ ను ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే టీమ్ ఇండియా తెలుపు, ఎరుపు విభాగంలో మొదటి స్థానంలో ఉంటుంది.

