టాలీవుడ్ డ్యాన్సర్ అసోసియేషన్ మధ్య నిన్న ( జూలై 12, 2026 ) వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ కొరియోగాపర్లు.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య పెద్ద రచ్చే జరిగింది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వ నమోదు, అంతర్గత పరిపాలన వంటి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో దారితీసింది. దీంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పి కూల్ చేశారు. పెద్ద యూనియన్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈమెపై లేటెస్ట్ గా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి, జానీ మాస్టర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివాదం క్లారిటీ ఇచ్చారు.
తమ మధ్య యుద్ధం అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని జానీ మాస్టర్ అన్నారు. మా డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఎలాంటి యుద్ధాలు లేవు. చిన్న చిన్న అభిప్రాయభేదాలు మాత్రమే .. ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. నిన్న ( జూలై 12, 2026) మా యూనియన్ సమస్యలపై డిష్కషన్స్ జరిగాయి. మేమందరం సోదరులం. అందరూ మంచి వ్యక్తులమే.. యూనియన్ కోసమే అందరూ వర్క్ చేస్తామన్నారు.
డ్యాన్స్ మాస్టర్ల మధ్య గొడవలు అంటూ వస్తున్న వార్తలు చూసి మెగాస్టార్ చిరంజీవి అడిగారని జానీ అన్నారు. ఈ రోజు ( జూలై 13, 2026 ) చిరంజీవితో కలిసి నేను శేఖర్ మాస్టర్ భోజనం కూడా చేశాం. సినిమాలు, పాటలు, డ్యాన్స్ స్టెప్ లు గురించి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం.. ఆల్ మాస్టర్స్ కు ఆల్ హీరోస్ సపోర్ట్ చేస్తారు. చిరంజీవి గారే మా అందరికీ స్పూర్తి అని జానీ మాస్టర్ అన్నారు.. సినీ ఇండస్ట్రీలో డ్యాన్సర్లకు మంచి గుర్తింపు, స్థానం ఉందంటే అందుకు కారణం చిరంజీవిగారే అని కొనియాడారు.
గత రెండు రోజులుగా కొన్ని తప్పుదారి పట్టించే వీడియోలు మరియు తప్పుడు నివేదికలు హల్ చల్ చేస్తున్నాయి….
నేను ఈ విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను… నాకు మరియు శేఖర్ మాస్టర్ అన్నకు మధ్య ఎలాంటి అపార్థం లేదా వైరుధ్యం లేదు. మేము ఒకే కుటుంబం మరియు మేము ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటాము.… pic.twitter.com/oCOsngCtwI
— జానీ మాస్టర్ (@ఎల్లప్పుడూ జాని) జూలై 13, 2026
మరోవైపు డ్యాన్సర్స్ అసోసియేషన్ నెలకొన్న పరిణామాలపై అధ్యక్షురాలు సుమలతా దేవి వివరణ ఇచ్చారు. డాన్సర్స్ అసోషోయేషన్ కు 35 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని నడిపించటం ఈజీ కాదు. ఏది జరిగినా ప్రెసిడెంట్ మీదకే వస్తుంది. మేమందం కలిసి కట్టుగానే ఉంటాం . ఏకపక్షనిర్ణయాలు గొడవలు ఏమీ లేవు అని చెప్పారు. అయితే కొందరి వల్ల కొన్ని తప్పులు జరుగుతున్నాయి. వారి వల్ల డ్యాన్సర్లు నష్టపోతున్నారు. దానిని ప్రశ్నిస్తే కొందరికి నచ్చడం లేదు.
►ఇంకా చదవండి | బాలయ్య కూతురు తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? డ్యాన్స్ వీడియోతో కొత్త చర్చ!
మా అసోషియేషన్ నిర్ణయం మీదకు అలాంటి వారిని సస్పెండ్ చేశాము. ఇద్దరు అవినీతి చేశారు. వారికి సపోర్ట్ గా మరికొందరు రాజీనామా చేశారు. కొత్తగా ఎలెక్షన్ పెట్టాలంటూ రాజీనామా అంటున్నారని సుమలత తెలిపారు. జనరల్ బాడీ మీటింగ్ లో బై ఎలక్షన్స్ కు వెళ్దామంటూ మెజారిటీ సభ్యులు తీర్మానించారు. అది బై లాస్ లో లేదు. ఎవరైతే రాజీనామాలు చేశారో వారికి ఎలక్షన్స్ పెట్టాలని ఆప్షన్ మీద నిన్న సీక్రెట్ ఓటింగ్ జరిగింది. మా పదవీకాలం ఉంది. ఫెడరేషన్ కు వ్యతిరేకంగా ఎవరు వెళ్లటం లేదు. రాజీనామా చేసిన వారికి ఉప ఎన్నిక నిర్వహించాలని ఎక్కువ మంది కోరారని సుమలత తెలిపారు.

