తెలంగాణ ఇచ్చాం.. అయినా.. పార్టీ అధికారంలోకి రాలేదు.. అనే స్థాయి నుంచి పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది. ఇలా.. పార్టీని చివరి ఆరు మాసాలు(2023కు ముందు) దూకుడుగా ముందుకు తీసుకువెళ్లడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకొన్నదే. ఎంతో మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నా ఈ ఒక్క కారణమే రేవంత్ రెడ్డికి సీఎం సీటును అప్పగించేలా చేసింది.
మరి ఈ తరహా.. పరిస్థితి ఏపీలో ఏమైంది ? అనేది ప్రశ్న. గత 2024 ఫిబ్రవరిలో అనేక ఆశలు, అంచనాలతో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల.. ముఖ్యమంత్రి అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఆమె కష్టపడితే.. పోయిన ప్రాభవాన్ని తీసుకుంటే.. ఆమెకు రెండు అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసి.. క్షేత్రస్థాయిలో సీనియర్లను తీసుకుని వారిని రంగంలోకి దింపండి.. పార్టీకి పునర్వైభవం తీసుకువస్తే.. ఆమెకు ముఖ్య మంత్రి పీఠం గోల్డెన్ ప్లేట్లో అందుతుంది.
పోనీ.. ఇది కుదరదు. పార్టీ బలపడేందుకు ఇంకా సమయం పడుతుందన్న అంచనా ఉంటే.. రెండో స్థానం కోసం అయినా.. ఆమె ప్రయత్నం చేయొచ్చు. అదే.. ప్రధాన ప్రతిపక్షం. కనీసంలో కనీసం.. 25 స్థానాల్లో పార్టీని గెలిపించుకున్నా.. ప్రధాన ప్రతిపక్షం హోదా వరించింది. తద్వారా.. ఆమెకు.. పార్టీకి కూడా మేలు జరుగుతుంది. కానీ, ఒప్పందం కూడా షర్మిల దృష్టి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో షర్మిల అసలు వ్యూహం ఏం చేస్తున్నారన్నది ప్రశ్న.
అంతర్గతంగా జరుగుతున్న చర్చ.. వస్తున్న వార్తల ప్రకారం.. సీనియర్లకు-షర్మిలకు మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు. ఇది నిజమే కావొచ్చు. పార్టీపరంగా ఎత్తుకోవాల్సిన అజెండాను ఆమె పక్కన పెట్టి.. వ్యక్తిగత విషయాలపై ఇంట్రస్ట్ దీనిని డామినేట్ చేసిందన్నది వాస్తవం. పెద్ద ఇదే సమస్యగా మారింది. కానీ, కొంత మేరకు నాలుగు అడుగులు ముందుకు వేసి.. అందరినీ కలుపుకొని పోతే.. ఆమెకు సీఎం సీటు లేదా.. ప్రధాన ప్రతిపక్షం స్థాయి గౌరవం సంస్థల్లో ఏదో ఒకటి ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచన చేస్తారో లేదో చూడాలి.

