ఆంధ్రప్రదేశ్:కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు.అమరావతిలో జరిగిన ‘యూనిట్ ట్రైనింగ్ క్లాస్’ (క్యాడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్) లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు,రాజధాని నిర్మాణంతో పాటుగా రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు,గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు.ఒకపక్క అభివృద్ధి చేస్తూనే మరోపక్క సంక్షేమాన్ని అమలు చేస్తున్న విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్నారు.

