ఆంధ్రప్రదేశ్:ఎన్నో ఏళ్లుగా శాశ్వత నివాసాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న సంచార జాతుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ( ఎమ్మెల్యే విజయశ్రీ )పేర్కొన్నారు.నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సంచార జాతుల వారితో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం(మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం),అధికారులతో కలసి ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా అనేక సంచార జాతుల వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
అన్న క్యాంటిన్ సమీపంలో సంచార జాతుల వారికి దుకాణాలు ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలాలు ఇప్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

