నవతెలంగాణ-శంకర్ పల్లి
సమాజం కోసం మనమందరం పునర్ అంకితం కావాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. పర్యావరణ వేదిక, గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ (జీడబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు గ్రామంలోని ఎక్స్పీరియమ్ ఎకో పార్క్‌లో మోకిలా ఎథ్నిక్ రన్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేతు ఉద్యమంలో భాగస్వాములు కావాలని.. ప్రతి పౌరుడు తాను సృష్టించే వ్యర్థాల పట్ల బాధ్యత వహిస్తూ, పర్యావరణ పరిరక్షణలో పాల్గొనాలని సూచించాడు. గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి వాణి తిమ్మయ్య మాట్లాడుతూ.. ఎథ్నిక్ రన్ కేవలం ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమం మాత్రమే కాదనీ, ప్రజల తమ మూలాలు, సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలతో మళ్లీ అనుసంధానం చేస్తూ ప్రకృతి పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తూ ఒక ఉద్యమకారుడిని చేశారు. పెద్ద స్థాయిలో నిర్వహించడం కూడా పర్యావరణ సూత్రాలను పాటించడం గర్వంగా ఉంది. దేశంలో ఉన్న పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న బృందాలు, మార్పు కోసం కృషి చేస్తున్న వ్యక్తులు ఒకే వేదికపైకి వచ్చి కలిసి పని చేస్తారని తెలిపారు.
ఈ వేదిక ద్వారా సుస్థిరత కోసం వినిపించే స్వరం మరింత బలంగా, మరింత దూరం వినిపించేలా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. డాక్టర్ శాంతి తుమ్మల మాట్లాడుతూ.. మహిళలు పర్యావరణ హితమైన ప్రత్యామ్నా వంటి మెన్ స్ట్రువల్ కప్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. అదే విధంగా, అవసరానికి మించి దుస్తులు కొనుగోలు చేయకుండా, ఇప్పటికే ఉన్న వాటిని మరమ్మతులు చేసుకొని మళ్లీ ఉపయోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గించేందుకు అవకాశం ఉంది. ప్లాస్టిక్ రహితంగా నిర్వహించిన నిర్వాహకులను ఆమె అభినందించారు. శ్రీ రామ్‌దేవ్ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడానికి కృషి చేసింది. వాటా ఫౌండేషన్‌కు చెందిన ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. చెట్ల పట్ల గౌరవ భావన ఉండాలని సూచించారు. జేఎస్ఆర్ అన్నమయ్య మాట్లాడుతూ.. వ్యర్థాల నిర్వహణ ప్రాముఖ్యతను వివరిస్తూ, వ్యర్థాలను నాలుగుగా విభజించాల్సిన అవసరాన్ని వివరించారు. ,
పోస్ట్ సమాజం కోసం అంకితం కావాలి మొదట కనిపించింది నవతెలంగాణ.

